హీరో ఉపేంద్ర నుంచే దొంగిలించా.. సీక్రెట్ చెప్పేసిన సుకుమార్
కన్నడ హీరో యాక్షన్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు హీరోగా వెండితెరపై సందడి చేసిన ఆయన.. ఇప్పుడు విలన్ పాత్రలలోనూ అదరగొట్టేస్తున్నారు. అయితే నటుడిగా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన అర్జున్.. ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటేస్ట్ మూవీ సీతా పయనం.
ఇందులో అర్జున్ సర్జాతోపాటు ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ వేడుకకు పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్, కన్నడ హీరో ఉపేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ కన్నడ స్టార్ హీరోను ఆకాశానికెత్తేశారు. ఉపేంద్ర సినిమాలు తనపై చాలా ప్రభావం చూపించాయంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సుక్కు. ఉపేంద్ర తెరకెక్కించిన A సినిమాను చూశాను. అలాగే ఓం చిత్రాన్ని చూశా… అని చెప్పిన సుక్కు.. ఇండియాలో ఏ దర్శకుడు కూడా అంత పిచ్చిగా, మ్యాడ్ గా, కన్ఫ్యూజింగ్ సినిమాలను రూపొందించలేదంటూ షాకింగ్ అండ్ క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఇప్పటికీ A సినిమా చూస్తే అలాగే అనిపిస్తుందని… A, ఓం, ఉపేంద్ర.. ఈ మూడు సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చంటూ చెప్పారు. ఒకవేళ ఆ మూడు సినిమాలు చేస్తే తాను ఎప్పుడో రిటైర్ అయిపోయేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన సినిమాల్లో స్క్రీన్ ప్లే ఇంత కల్ట్ గా ఉండడానికి కారణం ఉపేంద్ర తెరెక్కించిన ఆ మూడు సినిమాలే అని తన స్క్రీన్ ప్లే సీక్రెట్ చెప్పారు సుక్కు. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్యర్చపరచడం తనకు అలవాటని అన్నారు. ఈ విషయాన్ని ఉపేంద్ర నుంచే తాను దొంగిలించానని అన్నారు. ప్రస్తుతం సుకుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
1500 సార్లు టీవీలో వచ్చినా.. మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
