ఫ్యాన్ అలా పిలిచే సరికి.. సిగ్గుతో మొగ్గలేసిన రష్మిక
కన్నడనాటకు చెందిన రష్మిక మందన్నకు ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి డిమాండ్ ఉంది. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. దీంతో రష్మిక మందన్న తరచూ హైదరాబాద్, ముంబై, చెన్నై నగరాల మధ్య తిరుగుతుంటుంది.
తాజాగా రష్మిక ముంబై విమానాశ్రయంలో కనిపించింది. దీంతో చాలా మంది ఆమెను గమనించారు. రష్మిక కూడా అందరికీ హాయ్ చెబుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో ఒక అభిమాని రష్మికను చూసి ‘మేడమ్.. మీరు చాలా అందంగా ఉన్నారు, నేషనల్ క్రష్’ అని చెప్పాడు. దీంతో రష్మిక సిగ్గుతో మొగ్గలేసింది. నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అంతేకాదు ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ నెట్టింట క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముంబై విమానాశ్రయంలో రష్మిక చాలా సింపుల్ లుక్ లో కనిపించింది. వైట్ టీ- షర్ట్, బ్లూజీన్స్ తో పాటు ఒక బ్యాగుతో ఈ నేషనల్ క్రష్ దర్శనమిచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రష్మిక మందన్న కుబేర సినిమా పనుల్లో బిజీగా ఉంది. ఇది ఒక సోషల్ థ్రిల్లర్ సినిమా. ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన కుబేర సినిమా టీజర్ ప్రశంసలు అందుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరో ఉపేంద్ర నుంచే దొంగిలించా.. సీక్రెట్ చెప్పేసిన సుకుమార్
1500 సార్లు టీవీలో వచ్చినా.. మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
