1500 సార్లు టీవీలో వచ్చినా.. మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్
సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా రీ రిలీజ్ సందర్భంగా ప్రీ సేల్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖలేజా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, కృష్ణ గారి సోదరులు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు, కమెడియన్ అలీ, సునీల్ నారాయణ పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఈ మూవీ బుల్లితెరపై రికార్డ్ క్రియేట్ చేసిందని.. ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు ఈ మూవీ ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్. ముందుగా ఈ వేడుకలో మాట్లాడిన ఆదిశేషగిరి రావు.. తనకు నిర్మాతలిద్దరితో చాలా మంచి అనుబంధం ఉందన్నారు.పోకిరి సినిమాతో రీ రిలీజ్ మొదలైందన్నారు. ఈ సినిమాను సుబ్బారావు రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రీరిలీజ్‌తో నిర్మాతలు సంతోషంగా ఉంటున్నారని.. ఖలేజాకు మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఇక నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఖలేజా సినిమా రీ రిలీస్ అవుతున్న సందర్భంగా కనకరత్న మూవీస్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో ఈ సినిమాను చాలా కష్టపడి తీసినట్లు చెప్పారు ఈ మూవీ ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్. సినిమాలో ప్రతీ సీన్ చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. సినిమాలో త్రివిక్రమ్, మహేష్ బాబు, నమ్రత అందరూ ఒక టీంలా పనిచేశారన్నారు. ఇప్పటికి 1500 సార్లు బుల్లి తెరమీద ప్రదర్శించి రికార్డ్ సృష్టించిన సినిమా ఖలేజా అని సీ కళ్యాణ్ చెప్పారు. అయినా ఇప్పటికి యూత్ ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?

