సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా వైద్యరంగంలో ఏఐ.. వావ్ అనేలా సేవలు అందిస్తోంది. తాజాగా ఏఐ ద్వారా మరో అద్భుతాన్ని సాధించారు వైద్యులు. సూదితో పొడవకుండానే రక్త పరీక్షలు నిర్వహించే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అంతేకాక దీన్ని దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో అధికారికంగా ప్రారంభించారు.
సాధారణంగా రక్త పరీక్ష చేయాలంటే సూదితో గుచ్చి రక్తాన్ని తీసుకుని.. పరీక్షలు చేస్తారు. రిజల్ట్ కూడా త్వరగా రాదు. ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇకపై వీటికి చెక్ పెట్టేందుకు ఏఐ రెడీ అయ్యింది. సూదితో పొడిచి రక్తం తీయాల్సిన పని లేకుండానే.. రక్త పరీక్ష చేసేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా.. కేవలం ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు.. కీలకమైన ఆరోగ్య వివరాలు తెలుస్తాయి. ఇదెలా సాధ్యం అంటే.. దీని కోసం ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని తొలిసారిగా హైదరాబాద్ లో నిలోఫర్ ఆస్పత్రిలో ప్రవేశపెట్టారు. ఇకపై సూదితో పొడిచే పని లేకుండానే.. కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్త పరీక్షలు చేయవచ్చు. ఏఐ ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ టెక్నాలజీని అమృత్ స్వస్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విట్ వైటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. అమృత్ స్వస్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విట్ వైటల్స్ అనే సంస్థ ఈ అత్యాధునిక పీపీజీ పరికరాన్ని తయారు చేసింది. సాధారణంగా ఇప్పటి వరకు చేస్తున్న రక్త పరీక్షల్లో సూదితో గుచ్చి రక్తం తీయడమే కాక.. టెస్టులు చేయడానికి సమయం పడుతుంది.. రిపోర్టులు కూడా ఆలస్యంగా వస్తాయి. ఇక ఈ ఇబ్బందులకు కొత్త పరికరంతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు డాక్టర్ రవికుమార్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కింగ్ నాగ్ క్రేజీ డెసిషన్.. జైలర్‌కు తనేంటో చూపించేందుకు రెడీ!
ఒకప్పుడు తోపు హీరోయిన్.. యాక్సిడెంట్‌తో మతిమరుపు.. సన్యాసిగా జీవితం
ఫ్యాన్ అలా పిలిచే సరికి.. సిగ్గుతో మొగ్గలేసిన రష్మిక
హీరో ఉపేంద్ర నుంచే దొంగిలించా.. సీక్రెట్ చెప్పేసిన సుకుమార్
1500 సార్లు టీవీలో వచ్చినా.. మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
