Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిపిక్‌ మహాసముద్రం పూర్తిగా కనుమరుగు కాబోతుందా?

పసిపిక్‌ మహాసముద్రం పూర్తిగా కనుమరుగు కాబోతుందా?

Phani CH

|

Updated on: May 30, 2025 | 6:05 PM

ప్రపంచ పటం ముఖచిత్రం మారబోతుందా? భూమి స్వరూపంలో మార్పులు రాబోతున్నాయా? అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఖండాలు ఎన్ని అంటే ఏడు అని ఎల్కేజీ స్టూడెంట్‌ కూడా టక్కున సమాధానం చెబుతాడు. కానీ భవిష్యత్తులో ఖండాలు ఎన్ని అంటే ఎనమిది అని చెప్పుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

పసిఫిక్‌ మహాసముద్రం క్రమంగా కుచించుకుపోతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పూర్తి గా అంతరించిపోయి, భూమి లోపలి టెక్టోనిక్‌ ప్లేట్స్‌ ఒక చోటుకు చేరుకుంటాయి. ఫలితంగా రానున్న 20-30 కోట్ల సంవత్సరాల్లో కొత్తగా సూపర్‌ కాంటినెంట్‌ ఆవిర్భవిస్తుంది. ఆస్ట్రేలియాలోని కర్టిన్‌ విశ్వవిద్యాలయం, చైనాలోని పెకింగ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అడ్వాన్స్‌డ్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మోడల్స్‌ను వినియోగించి ఈ అంచనాకొచ్చారు. ప్రతి 60 కోట్ల సంవత్సరాలకు ఒక సూపర్‌ కాంటినెంట్‌ ఏర్పడుతుందని, ఇది ఏర్పడటం కోసం 200 కోట్ల సంవత్సరాల కాలంలో భూమిపైగల ఖండాలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నట్లు గుర్తించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఖండాలు కూడా మరో 20 కోట్ల సంవత్సరాల్లో మళ్లీ ఒక చోటుకు చేరుతాయని చెప్పారు. ఫలితంగా ఏర్పడే కొత్త సూపర్‌ కాంటినెంట్‌కు అమేసియా అని పేరు పెట్టినట్లు తెలిపారు. అమెరికా, ఆసియా ఢీకొన్నపుడు పసిఫిక్‌ మహాసముద్రం అంతరించిపోతుందని కొందరు విశ్వసిస్తున్నందువల్ల ఈ పేరు పెట్టామన్నారు. పసిఫిక్‌ మహాసముద్రం మూతపడితే, ఆస్ట్రేలియా మొదట ఆసియాను ఢీకొడుతుందని, ఆ తర్వాత అమెరికా, ఆసియా ఖండాలను కలుపుతుందని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్‌ టైమ్‌ హైదరాబాద్‌లో

కింగ్ నాగ్ క్రేజీ డెసిషన్.. జైలర్‌కు తనేంటో చూపించేందుకు రెడీ!

ఒకప్పుడు తోపు హీరోయిన్.. యాక్సిడెంట్‌తో మతిమరుపు.. సన్యాసిగా జీవితం

ఫ్యాన్ అలా పిలిచే సరికి.. సిగ్గుతో మొగ్గలేసిన రష్మిక

హీరో ఉపేంద్ర నుంచే దొంగిలించా.. సీక్రెట్ చెప్పేసిన సుకుమార్