పెన్నా నదికి స్నానానికి వెళ్లిన భక్తులు..అక్కడ కనిపించింది చూడగానే వీడియో
నెల్లూరు జిల్లాలో అరుదైన ఘటన వెలుగు చూసింది. జొన్నవాడ, కామాక్షి తాయి టెంపుల్ సమీపంలోని పెన్నా నదిలో అమ్మవారి విగ్రహం బయటపడింది. సరిగ్గా కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే నదిలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి శక్తి స్వరూపినిగా ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి పూజలు నిర్వహించారు.
విగ్రహాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి విగ్రహం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్షేత్రం కిటకిటలాడింది. జొన్నవాడ గ్రామ విధిలో రథం లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. కాగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో అల్లూరు జిల్లాలో బంగారు వర్ణపు ఆంజనేయ స్వామి విగ్రహం వాగు ఉద్రిక్తలో కొట్టుకు వచ్చింది. ఇసుక మేటలో భక్తులకు అభయం ఇస్తున్నట్లుగా నిలబడి ఉన్న స్వామి విగ్రహాన్ని చూసిన భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
పని చేద్దామని పొలంలోకి వెళ్లిన రైతు.. ఒక్కసారిగా షాక్ వీడియో
చెట్టు కింద పడుకున్న వ్యక్తి.. మట్టి పోసి చంపేశారా..! అసలేం జరిగింది?వీడియో
కస్టమర్‌ను చితకబాదిన జెప్టో డెలివరీ బోయ్.. ఎందుకో తెలిస్తే వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
