Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కస్టమర్‌ను చితకబాదిన జెప్టో డెలివరీ బోయ్‌.. ఎందుకో తెలిస్తే వీడియో

కస్టమర్‌ను చితకబాదిన జెప్టో డెలివరీ బోయ్‌.. ఎందుకో తెలిస్తే వీడియో

Samatha J

|

Updated on: May 29, 2025 | 9:11 AM

బెంగళూరులోని బసవేశ్వర్ నగర్లో కస్టమర్ పై డెలివరీ బాయ్ దాడికి పాల్పడ్డాడు. డెలివరీ చిరునామా విషయంలో తలెత్తిన వివాదం కాస్త కొట్టుకునే వరకు వెళ్ళింది. ఈ ఘటనలో కస్టమర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. డెలివరీ బాయ్ దాడి దృశ్యాలు ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బసవేశ్వర్ నగర్ కు చెందిన 37 ఏళ్ల శశాంక్ అనే వ్యాపారవేత్త ఆన్ లైన్లో కొన్ని వస్తువులు ఆర్డర్ చేశాడు. వాటిని డెలివరీ చేసేందుకు విష్ణువర్ధన్ అనే ఏజెంట్ వచ్చాడు.

ఆర్డర్ తీసుకునేందుకు శశాంక్ వద్దిన బయటకు వెళ్ళగా డెలివరీ చిరునామా తప్పుగా ఇచ్చారంటూ విష్ణువర్ధన్ ఆమెతో గొడవకు దిగాడు. పెద్దగా కేకలు వేస్తూ దుర్సుగా ప్రవర్తించాడు. ఈ గొడవను గమనించిన శశాంక్ అక్కడికి వచ్చి డెలివరీ ఏజెంట్ ప్రవర్తనను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విష్ణువర్ధన్ శశాంక్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో శశాంక్ తలకు తీవ్రగాయాలు అయ్యి రక్తస్రవం అయింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు బసవేశ్వర్ నగర్ పోలీసులు డెలివరీ ఏజెంట్ విష్ణువర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సదరు సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి నిందితుడి వివరాలు ఆరోపణలపై వివరణ కోరినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం 

ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదే వీడియో 

రైతులను పరుగులు పెట్టిస్తున్న పాములు వీడియో

ఈ మేక తెలివి మామూలుగా లేదుగా వీడియో