ఈ మేక తెలివి మామూలుగా లేదుగా వీడియో
మనుషులకే కాదు జంతువులకు తెలివితేటలు ఎక్కువే అందుకే అపాయంలో పడ్డప్పుడు కొన్ని జంతువులు తమ తెలివితో తప్పించుకుంటూ ఉంటాయి. అలాంటి ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింటో వైరల్ అవుతుంది. ఓ మేక తన యజమానికి షాక్ ఇస్తూ తప్పించుకొని పారిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఊరిని ఈ మేక తెలివితేటలు మామూలుగా లేవుగా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో మేకను కట్టేశాడు. మేకకు అది ఏ మాత్రం నచ్చలేదు. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని అనుకుంది. అంతే ఆలోచనకు పదును పెట్టింది. దాని బుర్రలో ఓ ఐడియా వచ్చింది. తన ముందున్న కాళ్ళను రేకుల షెడ్డు పై ఉంచి రెండు కాళ్ళపై నిలబడింది.
ఇప్పుడు దాని మెడలో తాడు నోటికి ఈజీగా అందింది. నోటితో మెడలో తాడును దానిని కట్టేసి ఉంచిన రాడ్డు పై నుంచి మెల్లగా తప్పించింది. వెంటనే అక్కడి నుంచి ఉడాయించింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆ మేక యజమాని దాని తెలివికి ముచ్చటపడిపోయాడు. ఈ సీన్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ మేక తెలివి మామూలుగా లేదుగా అంటూ కొందరు ఈ మేకను బంధించటం మహా కష్టం సుమీ అంటూ మరికొందరు వివిధ రకాల ఇమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను 71000 మందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో
నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో
70 ఏళ్ల వ్యక్తి గాల్ బ్లాడర్ లో 8,125 రాళ్లు! లెక్కపెట్టడానికి 6 గంటలు వీడియో
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
