నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో
హాంగ్ కాంగ్ కు చెందిన ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త కేతి చుయి వార్తల్లో నిలిచారు. ఆమె తన మామ నుంచి కోట్ల రూపాయల విలువైన బహుమతులు అందుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కానుకల మొత్తం విలువ సుమారు 2,209 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత కరెన్సీలో ఇది దాదాపు 2,209 కోట్ల రూపాయలకు సమానం. కేతి చుయి మామ మరెవరో కాదు. హాంగ్ కాంగ్ లో రెండో అత్యంత సంపన్నుడిగా పేరున్న రియల్ ఎస్టేట్ దిగ్గజం లీ షౌకి.
ఏషియా వారెన్ బఫెట్ గా ప్రసిద్ధి చెందిన ఆయన హెండర్సన్ ల్యాండ్ డెవలప్మెంట్ సంస్థలో ప్రధాన వాటాదారు. ఈ ఏడాది మార్చ్ 15న 97 సంవత్సరాల వయసులో లీ షౌకి కన్నుమూశారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం ఆయన మరణించే సమయానికి ఆయన ఆస్తి విలువ 29.2 బిలియన్ డాలర్లు. లీ షౌకికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆయన చిన్న కుమారుడైన మార్టిన్ లీ భార్య కేతి చుయి. 2006లో మార్టిన్ లీ తో కేతి చుయి వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. వివాహానికి ముందు నటిగా రాణించిన కేతి ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గుర్తింపు తెచ్చుకుంది. సేవా కార్యక్రమాల్లో ఆమె చూపిన చొరవకు ఎన్నో పురస్కారాలు కూడా లభించాయి. లీ షౌకి తన కోడలు కేతి చుయికి ఎన్నో విలువైన బహుమతులు అందించారని సమాచారం.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

