70 ఏళ్ల వ్యక్తి గాల్ బ్లాడర్ లో 8,125 రాళ్లు! లెక్కపెట్టడానికి 6 గంటలు వీడియో
ఢిల్లీలో 70 ఏళ్ల వ్యక్తికి అరుదైన ఆపరేషన్ చేశారు. వృద్ధుడి గోల్ బ్లాడర్ నుంచి 8125 రాళ్లను బయటకు తీశారు. ఆపరేషన్ అయ్యాక రాళ్లను లెక్కపెట్టడానికి ఆరు గంటల సమయం పట్టింది. ప్రస్తుతం వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం తెలిపింది. వైద్యుల వివరాల ప్రకారం వృద్ధుడు చాలాకాలంగా కడుపునొప్పి, జ్వరం, ఆకలి లేకపోవడం, బలహీనతతో బాధపడుతున్నాడు. తాజాగా అతనికి ఛాతిలో భారంగా అనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు మే 12న ఫోర్టిస్ ఇన్స్టిట్యూట్లో చేర్చారు.
అప్పటికే అతడు విషమస్థితిలో ఉన్నాడు. వెంటనే వైద్యులు అల్ట్రా సౌండ్ స్కేన్ చేయగా అతడి పిత్తాశయం భారీగా ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఇన్వెసివ్ లాపరోస్కోపిక్ సర్జరీ చేసి వృద్ధుడి పిత్తాశయంలో పేరుకుపోయిన వేలాది రాళ్లను తొలగించారు. శస్త్రచికిత్స దాదాపు గంటసేపు కొనసాగింది. వాటి లెక్కింపు ఆరు గంటలు జరిగింది. 8125 రాళ్ల కేసు ఎన్సిపిఆర్ పరిధిలో ఇదే మొట్టమొదటిది అయి ఉండొచ్చని యాజమాన్యం తెలిపింది. పిత్తాశయ రాళ్లకు చికిత్స చేయకపోతే రాళ్లు క్రమంగా పెరుగుతూనే ఉంటాయని డాక్టర్ అమిత్ జావేద్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రోగి నిర్లక్ష్యం కారణంగా రాళ్లు పెరిగాయని ఇంకా ఆలస్యమై ఉంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
