బోర్డు తిప్పేసిన దుబాయ్ కంపెనీ.. భారతీయులకు కుచ్చుటోపీ వీడియో
దుబాయ్ లో ఒక బ్రోకరేజ్ సంస్థ రాత్రికి రాత్రే దుకాణం ఎత్తేయడంతో పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు. బోర్డు తిప్పేసిన సంస్థలో ప్రవాస భారతీయులు కొందరు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. కొన్ని కోట్ల దిర్హంలతో ఉదయించిన కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని ఫోన్ కాల్స్ ద్వారా తమని సంప్రదించినట్లు కేరళకు చెందిన ప్రవాసులు మొహమ్మద్ ఫయాజ్ పోయెల్ తెలిపారు.
ఇద్దరు కలిసి ఉమ్మడిగా సంస్థలో దాదాపు 75 వేల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయారు. దుబాయ్ లోని ప్రతిష్టాత్మక బిజినెస్ బే ప్రాంతంలో ఈ సంస్థ కార్యాలయం తెరిచింది. 40 మంది సిబ్బందితో పెద్ద బిల్డప్ ఇచ్చింది. సంస్థ నుంచి సడన్ గా కాల్స్ ఆగిపోవడంతో సంస్థ కార్యాలయానికి వెళ్ళిన మొహమ్మద్ ఫయాజ్ పోయెల్ షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు 40 మంది సిబ్బంది పనిచేసిన బ్రోకరేజ్ సంస్థ కార్యాలయం ఖాళీగా దర్శనం ఇచ్చింది. మొదట్లో భారీ స్థాయిలో లాభాలు రావడంతో చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు.
వైరల్ వీడియోలు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
