Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో

సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో

Samatha J

|

Updated on: May 27, 2025 | 12:12 AM

కర్ణాటకలో జరిగిన ఒక పెళ్ళిలో ఆఖరి నిమిషంలో అనుహ్యమైన సంఘటన జరిగింది. తాళి కట్టే టైంలో తనకు పెళ్లి వద్దంటూ అమ్మాయి ఏడ్చేసింది. ఇది చూసి తల్లిదండ్రులే కాదు బంధువులు షాక్ అయ్యారు. హసన్ మండలం, భువనహళ్ళి గ్రామానికి చెందిన యువతికి ఆలూరు తాలూకా యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆహ్వాన పత్రికలు పంచారు. పెళ్లి బట్టలు, బంగారం ఇలా అన్నీ కొనుగోలు చేశారు. చంచునగిరి కళ్యాణ మండపంలో పెళ్లి. ఎంట్రీ నుంచి మండపం వరకు అన్ని రిచ్ గా ఉండేలా జాగ్రత్తపడ్డారు. బంధువులంతా వచ్చారు.

పెళ్లి తంతును తిలకించారు. కాళ్ళు కడగడం, జీలకర్ర, బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం, కన్యాదానం, సువర్ణ జలధార మంత్రం ఇలా ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. చివరిలో మూడు ముళ్ళ తంతు. అందరూ ఆసక్తిగా ఆ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో వధువుకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత నుంచి తాను ఏడుపు శురు చేసింది. ఏంటా అని అడిగేసరికి ప్లేటు పెరాయిచ్చింది. నాకు వద్దు ఈ పెళ్లి అంటూ తెగేసి చెప్పింది. ఈ హఠాత్ పరిణామం ఇరు కుటుంబాలనే కాదు అక్కడున్న వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కన్నవారు అయినవారు అందరూ ఎందుకు ఇలా చేస్తున్నావని వధువును ప్రశ్నించారు. ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కానీ వధువు ఎవ్వరి మాట వినలేదు. పెళ్లి ఆగిపోయిన మాటర్ తెలుసుకున్న పోలీసులు కూడా మండపానికి వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు వధువు ఓపెన్ అయింది.