కాలనీలో చిరుత సంచారం.. బిక్కుబిక్కుమంటూ స్థానికులు వీడియో
ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం సాధారణం అయిపోయింది. అడవిలో ఆహారం నీరు దొరకక గ్రామాల్లోకి చొరబడుతూ పశువులు మనుషులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. తాజాగా ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో మరోసారి చిరుత సంచారం కాలనీవాసులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. కొన్ని రోజులుగా కాలనీలో చిరుత సంచరిస్తుండటంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు కాలనీవాసులు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరి నియోజకవర్గం ఆగలి మండలంలోని గాయత్రి కాలనీలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొన్ని రోజులుగా గాయత్రి కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుత సంచరించడాన్ని స్థానిక ప్రజలు గమనించారు. రెండు రోజుల క్రితం చిరుత గొర్రెల మందపై దాడి చేసి వాటిని గాయపరిచింది. ఆదివారం రాత్రి కాలనీలో చిరుత సంచరిస్తుండగా అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న ప్రయాణికులు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. చిరుత సంచారం గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం
ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదే వీడియో
రైతులను పరుగులు పెట్టిస్తున్న పాములు వీడియో
ఈ మేక తెలివి మామూలుగా లేదుగా వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

