భోజనానికి వెళ్లిన షాపు యజమాని.. తిరిగి వచ్చేసరికి షాక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల దుకాణంలోకి కస్టమర్‌లా ప్రవేశించిన ఓ వ్యక్తి వెండి వస్తువులు కావాలని అడిగాడు. ఆ సమయంలో షాపులో వర్కర్ ఒక్కరే ఉండటంతో వెండి వస్తువుల కోసం వర్కర్ పక్కకి తిరగగానే అక్కడే ఉన్న బంగారు నగల బాక్స్ కొట్టేశాడు కేటుగాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో జరిగింది.
రాజీవ్ గాంధీ నగర్ లోని ఓ జువెలరీ షాపులోనికి ఓ వ్యక్తి వెండి వస్తువులు కావాలంటు వచ్చాడు, మధ్యాహ్నం సమయంలో షాపు యజమాని భోజనానికి వెళ్లిన సమయం చూసుకొని పక్కా స్కెచ్ తో దుకాణంలోకి ఎంటర్ అయిన దొంగ, వర్కర్ ని వెండి వస్తువులు కావాలని అడిగాడు. ఆమె అతను అడిగిన వస్తువులు తీస్తుండగా.. దొంగ అక్కడే ఉన్న టేబుల్ లోని బంగారు నగల బాక్స్‌ను కొట్టేశాడు. ఏమీ ఎరగనట్టు వర్కర్ చూపించిన వెండి వస్తువులు చూసి, తనకు నచ్చలేదని, అక్కరలేదని చెప్పి వెళ్లిపోయాడు. దొంగతనం జరిగిన గంట తర్వాత షాపులో వస్తువులు చూసిన యజమానికి ఓ బంగారు నగలు ఉండే బాక్స్ కనిపించకపోవడంతో సీసీ కెమెరాలను చెక్ చేశారు. ఈ క్రమంలోనే వెండి వస్తువులు కావాలంటు వచ్చిన వ్యక్తే చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు షాపు యజమాని. సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు దొంగ ఎత్తుకెళ్లినట్లు యజమాని కళ్యాణి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చావు బతుకుల్లో కొడుకు .. రూ. కోటి ఇన్సూరెన్స్ తీసుకున్న తల్లి.. చివరకు
TOP 9 ET News: అఖిల్ బ్యాచిలర్ పార్టీలో NTR హంగామా.. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?
వేరే హీరోను పొగిడాడని.. మేనేజర్‌పై దాడి చేసిన మార్కో హీరో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

