చావు బతుకుల్లో కొడుకు .. రూ. కోటి ఇన్సూరెన్స్ తీసుకున్న తల్లి.. చివరకు
తల్లి ప్రేమకంటే ఈ లోకంలో గొప్పది ఏదీ కాదు. బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం తల్లి ఎంతో తపన పడుతుంది. అయితే కొరియాలోని ఓ తల్లి వింత ప్రవర్తన ఆమె కుమారుడి ప్రాణాలు తీసింది. ఆ తల్లి... కుమారుడి ఆరోగ్యం విషమించి చావు బతుకుల్లో ఉండగా అతడిని పట్టించుకోలేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కొడుక్కి వైద్యం చేయించలేదు.
ఆ వ్యక్తి పేరు మీద కోటి రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ కొనడంలో బిజీగా ఉంది. చివరకు ఇన్సూరెన్స్ తీసుకుంది. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు అతడిని హాస్పిటల్‌లో చేర్పించినా లాభం లేకపోయింది. సకాలంలో వైద్యం అందక అతను ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన ఇరుగుపొరుగు వారు షాక్‌కు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కొరియాలోని ఉజెంగ్‌బూ ప్రాంతంలో గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటన మరోసారి వైరల్ అవుతోంది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు. కాలేయ సంబంధిత వ్యాధితో నరకం అనుభవించాడు. ఆమె ఇంట్లో రక్తపు వాంతులు చేసుకున్నాడు. అంతా చూస్తూనే ఉన్న ఆ తల్లి కేవలం 7 నిమిషాల దూరంలో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి నిరాకరించింది. ఆంబులెన్స్ కు కాల్ చేసినా ఆ వ్యక్తి బతికేవాడేమో! ఆమె నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆ సమయంలో జీవిత బీమా తీసుకునే పనిలో నిమగ్నం కావడం చూసి ఇరుగుపొరుగు వారు షాకయ్యారు. ఫలితంగా అతడు కన్నుమూశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అఖిల్ బ్యాచిలర్ పార్టీలో NTR హంగామా.. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?
వేరే హీరోను పొగిడాడని.. మేనేజర్‌పై దాడి చేసిన మార్కో హీరో
కోటిన్నర కారు కొన్న స్టార్ కమెడియన్

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
