Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెట్టు కింద పడుకున్న వ్యక్తి.. మట్టి పోసి చంపేశారా..! అసలేం జరిగింది?వీడియో

చెట్టు కింద పడుకున్న వ్యక్తి.. మట్టి పోసి చంపేశారా..! అసలేం జరిగింది?వీడియో

Samatha J

|

Updated on: May 29, 2025 | 9:14 AM

ఉత్తరప్రదేశ్ లో పారిశుధ్య సిబ్బంది నిర్వాహకంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కూరగాయలు అమ్ముకునే అతను బాగా అలసిపోయి ఒక చెట్టు కింద శేద తీరాడు. అప్పుడే నిద్రపట్టగా పారిశుధ్య కార్మికులు మట్టి పోసేందుకు వచ్చారు. వ్యక్తి ఉన్నాడని చూడకుండా అతనిపై మట్టి పోయగా ఊపిరాడక అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు అక్కడ పడుకోవడం చూసిన అతని తండ్రి విషయం చెప్పగా మట్టి తీసి చూశారు. ఆ లోపే అతడు మృతి చెందాడు. బరేలీ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కార్మికులు కాల్వను శుభ్రం చేశారు.

అందులోని పూడికను తీశారు. ఆ బురదనంతా ఒక ట్రాలీలో తీసుకొచ్చి చెట్టు వద్ద పారబోశారు. అయితే అదే చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిని వారు గమనించలేదు. ట్రాలీలో లోడ్ ఉన్న బురద ఒక్కసారిగా మీద పడిపోవడం, ఊపిరి ఆడకపోవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బరేలీ నగర మున్సిపల్ కార్మికుల ఏమరుపాటుతో ఒక వ్యక్తి సజీవ సమాధి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అయితే తన కుమారుడు మద్యం సేవించి వచ్చి అక్కడ పడుకున్నట్లు తండ్రి తెలిపాడు. స్థానికుల సహాయంతో బురద మట్టిని తొలగించి అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో భారీ స్థాయిలో బురద మట్టి పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం 

ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదే వీడియో 

రైతులను పరుగులు పెట్టిస్తున్న పాములు వీడియో

ఈ మేక తెలివి మామూలుగా లేదుగా వీడియో