కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం..ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా వీడియో
ఓ కారు డ్రైవర్ ఏకంగా జిల్లా కలెక్టర్ కి దిమ్మతిరిగే షాకిచ్చాడు. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 40 మందికి ఉద్యోగాలు ఇచ్చేశాడు. అవును వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కారు డ్రైవర్ గా పనిచేసే అతను ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేశాడు. అతనికి వేలాది రూపాయలు సమర్పించుకొని మోసపోయామని గుర్తించిన బాధితులు అసలు కథ బయటపెట్టడంతో ఆ కేటుగాడి బాగోతం బయటపడింది. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, సర్వీస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్లోని రామన్నపేట ప్రాంతానికి చెందిన మంద కళ్యాణ్ అనే వ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన తండ్రి వారసత్వంగా ఉద్యోగాన్ని సంపాదించిన ఈ వ్యక్తి జలసాలకు అలవాటుపడి కొత్త తరహా మోసాలకు తెరలేపాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. సుమారుగా 40 మందికి పైగా బాధితులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మబలికి డబ్బులు వసూలు చేశాడు. కొందరికి వరంగల్ జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కలెక్టర్ పేరుతో ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందజేశాడు.
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
