క్యాబ్ బుక్ చేసుకున్న మహిళ.. వచ్చిన డ్రైవర్‌ను చూసి షాక్ వీడియో
బెంగళూరులో ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆఫీస్ కి వెళ్దామని ఓబర్ నుంచి కాబ్ బుక్ చేసుకుంది. లొకేషన్ లో ఉన్నట్టుగా రైడర్ నుంచి కాల్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళాక వచ్చిన డ్రైవర్ ని చూసి ఆమె అవాక్కైంది. ఎందుకంటే వచ్చింది తన ఆఫీస్ లోనే పనిచేసే టీం లీడ్. తనకు కలిగిన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె ఒక స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. నేను ఓబర్ బుక్ చేశాను. నన్ను పిక్ చేసుకునే వ్యక్తి మా ఆఫీస్ లో టీం లీడ్ అని పేర్కొంది. ఎందుకు సార్ ఇలా కాబ్ డ్రైవ్ చేస్తున్నారు అని ఆమె అడిగితే ఏదో సరదా కోసం బోర్ కొట్టకుండా అని సమాధానం చెప్పాడట.
ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇదేం సరదా బాబు అంటూ కొందరు స్మైలీ ఎమోజీలు పెడుతున్నారు. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే నగరంలో సరదా కోసం కాబ్ డ్రైవింగ్ ఈ కేసు ఏదో తేడాగా ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. అమెరికాలో ఒక పెద్ద సంస్థ సీఈవో కూడా పార్ట్ టైం జాబ్ కింద హోటల్లో సర్వర్ గా పనిచేయడానికి వెనుకాడరు. కానీ మన దగ్గర ఇదో పెద్ద విషయం అని మరొకరు కామెంట్ పెట్టారు. జూలై 2024 లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వీకెండ్ లో ఆటో డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. తన కంపెనీ హుడి దరించి తన జీవితంలో ఒంటరితనాన్ని అధికమించడానికే డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలపడం అప్పట్లో వైరల్ గా మారింది.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

