Tollywood: ఒకప్పుడు బార్ ముందు మంచింగ్ ఐటమ్స్ అమ్మాడు.. కట్ చేస్తే 800 కోట్ల సినిమాతో సంచలనం.. ఎవరో తెలుసా?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న వారిలో చాలా మంది కెరీర్ ప్రారంభంలో వివిధ రకాల ఉద్యోగాలు, పనులు చేసిన వారే. కొందరైతే పొట్ట కూటి కోసం రోజు వారీ కూలిగా పనిచేశారు. ఇంకొందరు రోడ్డు మీద కూరగాయలు, ఆకు కూరలు అమ్మారు.

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. అదృష్టం కూడా ఉండాలి. అన్నిటికీ మించి ఎంతో ఓర్పు, సహనం ఉండాలి. అప్పుడే సినిమా పరిశ్రమలో సక్సెస్ అవుతారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సినిమా సెలబ్రిటీ కూడా చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు పడ్డాడు. నాలుగేళ్ల వయసులోనే ముంబైకు వచ్చాడు. పొట్ట కూటి కోసం ఆరేళ్లకే డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. మద్యం దుకాణాల ఎదుట కోడిగుడ్ల వంటి మంచింగ్ ఫుడ్ ఐటమ్స్ అమ్మాడు. అలాగే పార్క్ లో వడాపావ్ విక్రయించాడు. అయితే అధికారులు దానిని సీజ్ చేయడంతో మళ్లీ రోడ్డున పడ్డాడు. అయితే స్నేహితుడి సహాయంతో గణపతి ఉత్సవాల్లో దేవుడి విగ్రహాల నిమజ్జనానికి వెళ్లాడు. అక్కడ ధనవంతుల ఇళ్లల్లో కూర్చొబెట్టిన విగ్రహాలను నిమజ్ఞనం చేసి డబ్బులు సంపాదించాడు. అదే క్రమంలో నటనపై ఆసక్తి ఉండడంతో ఓరోజు పేపర్‌లో ఫిల్మ్ స్టూడియో యాడ్ చూసి అక్కడకు వెళ్లాడు. డబ్బు కోసం ఫిల్మ్ స్టూడియో ఫ్లోర్లు, వాష్ రూమ్స్ శుభ్రం చేశాడు. అలాగే అక్కడి వారికి టీలు, కాఫీలు అందించాడు. అదే సమయంలో ఎడిటింగ్, సినిమా మేకింగ్‌కు సంబంధించిన పలు విషయాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు శ్రమించి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా సత్తా చాటాడు. ఇప్పుడు ఏకంగా 800 కోట్ల సినిమాతో సంచలనం సృష్టించాడు. అతను మరెవరో కాదు ఛావా సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ మరాఠీ డైరెక్టర్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చిన్నతనంలో తాను ఎలాంటి కష్టాలు పడ్డాడో గుర్తు చేసుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వినోద్ ప్రధాన్‌కు అసిస్టెంట్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు లక్ష్మణ్. ‘102 నాటౌట్’, ‘హిందీ మీడియం’, ‘డియర్ జిందగీ’ వంటి చిత్రాల్లో పాలు పంచుకున్నాడు. 2014లో ‘తాపాల్’ అనే మరాఠి చిత్రంతో డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టుకున్నాడు. ‘లూకా చుప్పి’, ‘మిమీ’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఛావా సినిమాతో కమర్షియల్ భారీ హిట్ కొట్టాడు లక్ష్మణ్. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ. 800 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.
చావా హీరో విక్కీ కౌశల్ తో డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్..
Vicky Kaushal shared some pics with director Laxman Utekar to wish him on his birthday, the man who made him Raaje ❤️✨#VickyKaushal #Chhaava pic.twitter.com/Sa47FO1hNh
— VK👑 (@VickySupremacy) June 1, 2025
ఇవి కూడా చదవండి..
Khaleja Movie: దిలావర్ సింగ్ భార్య ఈమె కాదా? ఖలేజా రీ రిలీజ్ వేళ వెలుగులోకి అసలు విషయం
Balakrishna: బాలయ్య పక్కన నటించి.. ఆఖరికి ఆ ఇంటికే కోడలిగా వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?








