AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suniel Shetty: నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ ఈజీనా? సునీల్ శెట్టిపై టాలీవుడ్ హీరోయిన్ ఆగ్రహం

ఇటీవల ఆడవాళ్ల గురించి బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన కూతురు అతియా శెట్టి సీ సెక్షన్‌ (సిజేరియన్)కు వెళ్లకుండా కష్టమైనా నేచురల్‌ డెలివరీనే ఎంచుకుందని చేసిన సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

Suniel Shetty: నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ ఈజీనా? సునీల్ శెట్టిపై టాలీవుడ్ హీరోయిన్ ఆగ్రహం
Suniel Shetty
Basha Shek
| Edited By: TV9 Telugu|

Updated on: Sep 04, 2025 | 10:13 AM

Share

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ ప్రముఖ నటి అతియా శెట్టి ఇటీవల అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది మార్చి 24న అతియా శెట్టి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అతియాకు బిడ్డ పుట్టడంతో ఆమె తండ్రి సునీల్ శెట్టి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను తాతయ్యను అన్నానంటూ తెగ సంబరపడిపోతున్నాడు. అయితే ఇదే సమయంలో ప్రసవం గురించి సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమమయ్యాయి. ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడిన అతను.. తన కూతురు చాలా కంఫర్టబుల్ గా ఉందని, ఆమె సీ సెక్షన్‌ (సిజేరియన్)కు వెళ్లకుండా నార్మల్ డెలివరీనే ఎంచుకుందన్నాడు. దీంతో ఈ కామెంట్స్ దుమారం రేపాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సునీల్ కామెంట్స్ ను వ్యతిరేకించాడు. తాజాగా మరో ప్రముఖ నటి గౌహర్ ఖాన్ ఈ విషయంపై స్పందించింది.

ఇటీవల ఓ షోకు హాజరైన గౌహర్ ఖాన్ ‘ఈ మధ్య ఓ సెలబ్రిటీ (సునీల్‌ శెట్టి) సాధారణ ప్రసవం కన్నా సిజేరియన్ ఆపరేషన్‌ ఈజీ అన్నారు. ఆ మాట వినగానే నాకు గట్టిగా అరవాలనిపించింది.ఆయన అలా ఎలా అనగలిగారు? అబ్బాయిలకు ప్రెగ్నెన్సీ ఉండదు, నవమాసాలు మోయరు, సీ సెక్షన్‌ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అసలు అర్థం కాదు. మీకసలు ఏదీ తెలీదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

భర్త, కుమారుడితో గౌహార్ ఖాన్..

View this post on Instagram

A post shared by Gauahar Khan (@gauaharkhan)

ఎవరీ గౌహర్‌ ఖాన్‌?

గౌహర్‌ ఖాన్‌ కు టాలీవుడ్ తోనూ పరిచయం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌లో ‘నా పేరే కాంచనమాల’ అనే స్పెషల్ సాంగ్ లో కనిపించిందీ ఈ ముద్దుగుమ్మనే. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను 2020లో పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో కుమారుడు జెహాన్‌ పుట్టాడు. ప్రస్తుతం ఆమె మరోసారి గర్భం దాల్చింది.

View this post on Instagram

A post shared by Gauahar Khan (@gauaharkhan)

ఇవి కూడా చదవండి..

Tollywoood: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు సన్నజాజి తీగలా.. 6 నెలల్లో 55 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఎలాగంటే?

Balakrishna: బాలయ్య పక్కన నటించి.. ఆఖరికి ఆ ఇంటికే కోడలిగా వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?