Tollywood: టాలీవుడ్ తోపు హీరోయిన్.. 12 ఏళ్లలో 100కు పైగా సినిమాలు.. కానీ 3నెలల గర్భంతో 32 ఏళ్లకే కన్నుమూసింది
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఈ అందాల తార కూడా ఒకరు. తన అందం, అభినయంతో స్టార్ హీరోలకు మించి క్రేజ్ సొంతం చేసుకుందీ ముద్దుగుమ్మ. కానీ 32 ఏళ్లకే ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.

చాలా మంది లాగే డాక్టర్ కావాల్సిన ఈ అమ్మాయి అనుకోకుండా హీరోయిన్ గా మారింది. తన నటనా ప్రతిభతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కోట్లాది మంది అభిమానులును సొంతం చేసుకుంది. చక్కటి చీరకట్టులో.. నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిగా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించిందీ అందాల తార. ఫ్యామిలీ ఆడియెన్స్ అయితే ఈ బ్యూటీ సినిమాలకు బ్రహ్మరథం పట్టేవారు. ఇక అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారంటే.. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు దశాబ్ద కాలం పాటు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన ఈ అందాల తార 100 కు పైగా సినిమాల్లో నటించింది. సినిమా ఇండస్ట్రీలో ధ్రువతారగా వెలిగిన ఈ అందాల తార అనుకోని ప్రమాదంలో కన్ను మూసింది. 2004లో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా కన్ను మూశారు. అప్పటికే ఆమెకు పెళ్లయింది. రెండు నెలల గర్భవతి కూడా. ఆమె మరెవరో కాదు అభినవ సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య.
మనవరాలి పెళ్లి’ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సౌందర్య. ఆ తర్వాత’రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఆపై మాయలోడు, హలో బ్రదర్, అల్లరి ప్రేమికుడు, మేడమ్, పెదరాయుడు, అమ్మోరు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, దొంగాట, పెళ్లి చేసుకుందాం, ప్రేమించుకుందాం, చూడాలని ఉంది, శ్రీరాములయ్య, అంతఃపురం, రాజా, అన్నయ్య, జయం మనదేరా, శ్రీ మంజునాథ, నిన్నే ప్రేమిస్తా. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుందీ అందాల తార. సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే 2004లో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూసింది. ఇప్పుడీ అందాల తార ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆమె నటించిన సినిమాలు, పోషించిన పాత్రల రూపంలో ఎల్లప్పుడూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచి ఉంటుంది.

Actress Soundarya








