AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్.. అద్బుతమైన నాట్యమయూరి..! 50ఏళ్లు దాటినా ఇప్పటికీ సింగిల్‌గానే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో పరిచయం అవసరం లేని హీరోయిన్ ఆమె. కథానాయికగానే కాదు.. భారతనాట్యం నృత్యకారిణిగానూ తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగుతోపాటు.. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె వయసు 53 ఏళ్లు. అయినా పెళ్లికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నారు.

ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్.. అద్బుతమైన నాట్యమయూరి..! 50ఏళ్లు దాటినా ఇప్పటికీ సింగిల్‌గానే..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2025 | 6:17 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోస్ సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి అగ్ర కథానాయకులతో స్క్రీన్ షేర్ చేసుకుని..ఇప్పుడు ఇండస్ట్రీలో సహయ నటిగా రాణిస్తుంది. అప్పట్లో ఆమె అందానికి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు. అంతే కాదు ఆమె అభినయం ఓ అద్భుతమనే చెప్పాలి. ఆమె తెర పై నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం.. స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది హృదయాలను దోచుకుంది ఆమె.. పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు.. 55 ఏళ్లు వచ్చినా కూడా.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

పై ఫొటోలో ఉన్న నటి ఎవరో కాదు అలనాటి అందాల తార శోభన. అప్పట్లో ఎంతో మంది నటీమణులు స్టార్ హీరోలకు పోటీగా నటించి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించారు. అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సొంతంగా క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఇటీవల ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ, అత్త పాత్రలు చేస్తున్నారు. ఇటీవలే తడురమ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మోహన్ లాల్ హీరోగా నటించారు.

ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆమె ప్రేమ, పెళ్లికి దూరంగానే ఉన్నారు. శోభన.. మార్చి 21, 1970న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. 1980లో శ్రీకాంత్, కెఆర్ విజయ నటించిన మంగళ నాయకి చిత్రంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. మలయాళ చలనచిత్ర ప్రపంచం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఆమె. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన శోభనకు ఇప్పటికీ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. తెలుగు, కన్నడ, హిందీ వంటి 200 కి పైగా చిత్రాలలో నటించారు శోభన. ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు శోభన. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.