దిలావర్ సింగ్ భార్యను.. నేను కాదు మొర్రో అంటే వినరే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖలేజా. వీరి కాంబోలో అంతకు ముందు వచ్చిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కృష్ణ జయంతిని పురస్కరించుకుని సుమారు 15 ఏళ్ల తర్వాత ఖలేజా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. అప్పట్లో ప్రేక్షకుల ఆదరణకు నోచుకోని ఈ మూవీ ఇప్పుడు మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంటోంది.
రీ రిలీజ్ కలెక్షన్లలో రికార్డులు కొల్లగొడుతోంది. ఇక మహేష్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం థియేటర్లకు భారీగా తరలి వస్తున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా పామును పట్టుకుని థియేటర్ లోకి వచ్చాడు. ఇలా చాలా మంది ఖలేజా సినిమా సీన్లను రిక్రియేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఖలేజా సినిమా రీ రిలీజ్ వేళ ఒక నటి పేరు బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. చాలా మంది ఇదే సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అనుకున్నారు. కానీ అసలు విషయం కాదు. ఇదే సినిమాలో కేవలం 5 సెకన్లు కనిపించిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఖలేజా సినిమాను ఎక్కువగా రాజస్థాన్‌లోనే షూట్ చేశారు. ఆ సమయంలో టాక్సీ డ్రైవర్ అయినా హీరో మహేష్ బాబు అనుష్కతో కలిసి దిలావర్ సింగ్ అనే వ్యక్తి ఇంటికి వెళతాడు. ఆ సీన్ లో రొట్టెలు కాలుస్తూ దిలావర్ సింగ్ భార్య కనిపిస్తుంది. అది కూడా 5 సెకన్లు మాత్రమే. కానీ ఆమె తన క్యూట్ లుక్స్ తో అందరినీ కట్టి పడేసింది. అయితే ఈ సీన్ లో ఉన్నది దివ్య మేరి సిరియాక్ అని సోషల్ మీడియాలో పోస్టులు, వార్తలు దర్శనమిస్తున్నాయి. అయితే వీటిని చూసిన ఆమె తాను అసలు ఖలేజా సినిమాలో నటించలేదని షాకింగ్ న్యూస్ చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్ కోసం పోటీపడుతున్న.. ముగ్గురు స్టార్ డైరెక్టర్స్
సినిమా కొట్టింది.. కార్ పట్టుకెళ్లింది! ఆకాంక్ష సింగ్ ఆగట్లేదుగా
రూ.100 కోట్లకు ఓకే అంది! కానీ హీరోను చూసే జడుసుకుని సినిమా వదిలేసింది..
శింబుతో రిలేషన్‌కు చెక్ పెట్టింది! లక్కీ గర్ల్! లేదంటేనా..?
అలీకి మెగాస్టార్ చిరు స్పెషల్ గిఫ్ట్.. మురిసిపోయిన అలీ- జుబేదా

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
