AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చులకనగా చూస్తారు.. స్టేజ్ పైనే కన్నీళ్లుపెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ అందుకుంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో మన తెలుగింటి అమ్మాయి ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

చులకనగా చూస్తారు.. స్టేజ్ పైనే కన్నీళ్లుపెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2025 | 6:50 PM

Share

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు. కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది ఈ పోటీని తట్టుకలోలేక ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అలాగే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా, సైడ్ యాక్టర్స్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత మెయిన్ హీరోలుగా , హీరోయిన్స్ గా చేస్తూ ఉంటారు. కాగా పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ అమ్మడు దాదాపు 12 సినిమాలు హీరోయిన్ గా చేస్తే కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అయినా కూడా అవకాశాలకు మాత్రం కొదవలేదు.. తెలుగుతో పాటు తమిళ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది ఈ చిన్నది.. అయినా లాభం లేకుండా పోయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

చాలా మంది హీరోయిన్ తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటారు.. అలాగే ఈ అమ్మడు కూడా.. ఇంతకూ ఆమె ఎవరంటే.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రీతూ వర్మ. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది రీతూ వర్మ. ఆ సినిమాలో కాజల్ చెల్లిగా నటించింది. ఆతర్వాత ఈ చిన్నది హీరోయిన్ గా మారింది ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఇక ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆసినిమా తర్వాత రీతూకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తమిళ్ లోనూ సినిమాలు చేసింది. కానీ ఈ బ్యూటీకి ఎక్కువగా హిట్స్ రాలేదు. దాదాపు 12 సినిమాలు చేస్తే కేవలం నాలుగు సినిమాలే హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన మజాకా సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది ఓ వెబ్  సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది. దేవిక అండ్ డానీ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఈవెంట్ లో రీతూ వర్మ మాట్లాడుతూ ఎమోష్నలైంది. మన చుట్టూ ఉన్న వారే మనల్ని చులకనగా చూస్తారు అని ఎమోషనల్ అయ్యింది. నువ్వు చేయలేవు, ఇలానే ఉండాలి అంటూ కండీషన్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటి అనుభవాలు ఎక్కువగా అమ్మాయిలకే ఉంటాయి.. ఈ వెబ్ సిరీస్ చాలా మంది ధైర్యాన్ని, బలాన్ని అందిస్తుందని నేను నమ్ముతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు