AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా.. రూ.15 కోట్లతో నిర్మిస్తే 300 కోట్ల కలెక్షన్స్.. సీన్ సీన్‏కు ట్విస్టులే..

క్రైమ్ డ్రామాలను చూసేందుకు ఇష్టపడతారా..? అయితే ఈ సినిమా గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే. దాదాపు 2 గంటల 17 నిమిషాలు ఉండే ఈ సినిమా అనుక్షణం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కేవలం 15 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా.. రూ.15 కోట్లతో నిర్మిస్తే 300 కోట్ల కలెక్షన్స్.. సీన్ సీన్‏కు ట్విస్టులే..
The Kerala Story
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2025 | 7:53 AM

Share

ఈమధ్యకాలంలో తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా కథ బలంగా ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాపై చాలా ప్రేమను కురిపిస్తారు. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఒక చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. 2023 సంవత్సరంలో విడుదలైన ఆ సినిమా అప్పట్లోనే భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ ట్యాగ్‌ను సంపాదించింది. ఇక ఇప్పుడు ఓటీటీ సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ చిత్రమేంటో తెలుసా.. ? అదే ‘ది కేరళ స్టోరీ’. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ ప్రధాన పాత్రలో నటించగా.. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను కేవలం రూ.15 కోట్లతో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.

కేరళలోని హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి ఆ తరువాత ఉగ్రవాద సంస్థల్లోకి చేర్చుకోవడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేరళలోని ఒక కళాశాలలో నర్సు కావాలనే కలతో అడ్మిషన్ తీసుకునే షాలిని ఉన్నికృష్ణన్ (ఆదా శర్మ) అనే హిందూ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఆమెకు ఆసిఫా, గీత, నీమా అనే ముగ్గురు అమ్మాయిలతో స్నేహం ఏర్పడుతుంది. మొదటి నుంచి సినిమా ఆసక్తిగా సాగుతుంది. కానీ ఆ తర్వాత షాలినికి బ్రెయిన్ వాష్ జరుగుతుంది. ప్రేమ పేరుతో అమ్మాయినిషాలిని ఫాతిమాగా పేరు మార్చుకుని ఉగ్రవాదిని వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమెను మోసగించి సిరియాకు బలవంతంగా పంపిస్తారు. దీంతో ఆమె జీవితంలో ఎదురైన పరిస్థితులు, చివరకు ఆ ఉగ్రవాదుల నుంచి ఎలా తప్పించుకుంది? అనేది సినిమా.

2023లో ఈ సినిమా విడుదలైనప్పడు అనేక వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు సంపాదించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో ఆదా శర్మతోపాటు యోగితా బిహానీ, సోనియా బలాని, సిద్ధి ఇద్నాని, ప్రణయ్ పచౌరి, ప్రియదర్శిని, ప్రణవ్ మిశ్రా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

Follow Us