Tollywood: ఇన్ఫోసిస్‌లో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు.. ఇస్రోలోనూ ఆఫర్.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
చాలా మంది లాగే ఈ హీరోయిన్ కూడా కెరీర్ ప్రారంభంలో చాలా జాబులు చేసింది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ లో చాలా ఏళ్లు పనిచేసింది. అక్కడ బెస్ట్ ఎంప్లాయి అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇస్రోలోనూ జాబ్ ఆఫర్ వచ్చింది.. కానీ..

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? 90ల నాటి సినిమాలను బాగా చూసి ఉంటే ఈ అమ్మాయిని గుర్తు పట్టవచ్చు. ఎందుకంటే ఈ పాప పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. తన నటనా ప్రతిభకు ఏకంగా నంది పురస్కారం కూడా గెల్చుకుంది. అయితే చదువుకు గ్యాప్ రాకూడదన్న కారణంతో కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఈ క్రమంలోనే ఉన్నత చదువులు అభ్యసించింది. బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ఇన్ఫోసిస్ లో చేరింది. చాలా ఏళ్ల పాటు మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ లో ఇంజినీర్ గా విధులు నిర్వర్తించింది. మధ్యలో ఇస్రో ఎగ్జామ్ కూడా పాసైంది. జాబ్ ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. అయితే కొన్ని రోజులకు ఇస్రో, ఇన్ఫోసిస్ రెండు వద్దనుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్యన ఒక బోల్డ్ వీడియోతోనూ వార్తల్లో నిలిచిన అందాల తార మరెవరో కాదు ఒకప్పటి దేవుళ్లు సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్ నిత్యా శెట్టి.
దేవుళ్లు సినిమాతో పాటు అంజి, చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్, మాయ తదితర సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది నిత్యా శెట్టి. తన నటనా ప్రతిభకు ప్రతీకగా నంది అవార్డు కూడా అందుకుంది. ఇక 2019లో నువ్వు తోపురా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ పిట్టకథ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తలైవీ, మోస్ట్ వాంటెడ్ పండుగాడు సినిమాలతో ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. అలాగే హలో వరల్డ్, 3 సి అనే వెబ్ సిరీసుల్లోనూ నటించి మెప్పించింది. అయితే ఆ మధ్యన ఒంటిపై కేవలం టవల్ తో ఉండి బాత్ టబ్ లో స్నానం చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది నిత్య. దీంతో ఈ అమ్మడిపై విమర్శలు వచ్చాయి.
నిత్యా శెట్టి లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
View this post on Instagram








