AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఎందుకిలా అందరినీ మోసం చేస్తున్నావ్‌ ? సమంతపై మళ్లీ విరుచుకుపడిన డాక్టర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే సమంత పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Samantha: ఎందుకిలా అందరినీ మోసం చేస్తున్నావ్‌ ? సమంతపై మళ్లీ విరుచుకుపడిన డాక్టర్
Samantha
Basha Shek
|

Updated on: Jun 04, 2025 | 6:28 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతంలో మయోసైటిస్ బారిన పడింది. విదేశాల్లో చికిత్స తీసుకుని క్రమంగా ఈ వ్యాధి నుంచి బయటపడింది. దీని తర్వాత ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటోంది సామ్. హెల్దీ లైఫ్ స్టైల్ ను అలవర్చుకోవడంతో పాటు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తన ఫాలోవర్లకు అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే పలు మెడిసిన్స్ గురించి కూడా ఇన్ స్టా గ్రామ్ లో పోస్టుల పెడుతోంది. ఈ క్రమంలో సామ్ ఇటీవల షేర్ చేసిన ఒక పోస్ట్‌ వివాదాస్పదమైంది. అందులో ఆమె ఎన్‌ఎమ్‌ఎన్‌ (నికోటినమైడ్‌ మోనోన్యూక్లియోటైడ్‌) అనే సప్లిమెంట్‌ బ్రాండ్ ను ప్రమోట్‌ చేసింది. ఇది శరీరంలో ఎన్ ఏ డీ (నికోటినామైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్) స్థాయిలను పెంచుతుందని, దీనివల్ల శక్తి పెరుగుతుందని, త్వరగా కోలుకుంటారని, ఏకాగ్రత పెరుగుతుందని సామ్ పేర్కొంది. ‘నేను కేవలం వీటిని తీసుకోవడమే కాదు గటాకా సంస్థ కోఫౌండర్‌గానూ మారాను. ఎందుకంటే నేను ఈ సప్లిమెంట్లను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది షార్ట్‌కట్స్‌ కోసం కాదు మీ భవిష్యత్తు కోసం’ అని సామ్ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టును చూసిన ద లివర్‌ డాక్టర్‌.. సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఔషధం అంటూ నకిలీ మందులను ప్రమోట్‌ చేస్తోందంటూ హీరోయిన్ పై విమర్శలు గుప్పించాడు

‘సమంత సైన్స్ తెలియని నటి. ఆమె ప్రమోట్ చేస్తున్న కంపెనీ ఒక మోసపూరితమైనది. నాడ్ అనేది జీవక్రియకు ఒక ముఖ్యమైన కో ఎంజైమ్ . అయితే NMN అనేది నాడ్ స్థాయిలను పెంచుతుందని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రచారంలో ఉన్న ఒక సప్లిమెంట్. చాలామంది.. దీనిని వాడితే వృద్ధాప్యాన్ని తగ్గించే అద్భుతమైన ఔషధం అంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఏవి లేవు. దీనివల్ల శరీరం శోషణకు గురవుతుందే తప్ప అవయవాలకు చేరుతుందని ఎటువంటి ఆధారాలు లేవు. ఎలుకలపై నెలలపాటు ప్రయోగాలు జరిపినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కాస్తంత చురుకుగా ఉన్నట్లు తేలింది. అంతేకానీ వాటి జీవితకాలం పెరిగిందనో.. లేదా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమయ్యాయనో నిరూపితం కాలేదు. పైగా ఈ మందులు శరీరంలోని కీలకమైన కణాల వరకు చేరి వాటిని రిపేర్‌ చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు. పని చేయని మందులు వాడమంటూ లక్షలాది అభిమానులను ఈ సైన్సు తెలియని సెలబ్రిటీలు ఎందుకు మోసం చేస్తున్నారు?

‘మీకు నిజంగా వయసు కనిపించకుండా మరింత యవ్వనంగా కనిపించాలనుంటే ఆహారశైలి, వ్యాయామం, నిద్రపై ఫోకస్‌ పెట్టండి. సిగరెట్‌, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండండి. పాములాంటి ప్రచారకర్తలు చెప్పే మాటల్ని నమ్మవద్దు. నిజమైన సైన్సును, సాక్ష్యాలను మాత్రమే నమ్మండి. అసలైన వైద్యులు చెప్పేదే వినండి’ అని రాసుకొచ్చాడు డాక్టర్.

డాక్టర్ షేర్ చేసిన పోస్ట్..

లివర్‌ డాక్టర్‌ సమంతపై విమర్శలు కురిపించడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ ఆయన నటిపై ఇలాగే తీవ్ర విమర్శలు చేశాడు. మరి వీటిపై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.