ఈ అమ్మడికి 5-10 మంది పిల్లలను కనాలని ఉందట.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. తెలుగు, హిందీలో సినిమాలు చేసి ఆతర్వాత ఉన్నట్టుండి కనిపించకుండా మాయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలకు దూరం అయినా కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు.

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి హఠాత్తుగా కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్ ఒకరు. కల్యాణ్ రామ్ కత్తి, నాగార్జున గగనం, మంచు మనోజ్ మిస్టర్ నూకయ్య సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయమే. అయితే 2019లో దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు, వ్యాపార వేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ ను సనాఖాన్ వివాహం చేసుకుంది. అంతకు ముందే సినిమాలకు గుడ్ చై చెప్పేసిన ఈ అందాల తార పెళ్లి తర్వాత దుబాయ్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. సనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ప్రెగ్నెన్సీ గురించి వివిధ విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. గతంలో ఓ వీడియోలో 5-10 మంది పిల్లలకు జన్మనివ్వాలనే కోరికను సనా వ్యక్తం చేసింది. దీనిపై నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌పై కూడా సనా అభిప్రాయాలను నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు.
ఈ వీడియోలో, సనా మాట్లాడుతూ, “నేను ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మినివ్వాలనుకుంటున్నాను. ఆ సంఖ్య ఐదు కావొచ్చు.. పది కావొచ్చు.. పూర్వ కాలంలో మహిళలు 12-12 మంది పిల్లలకు ప్రసవించే వారట. నేను గర్భం ధరించినప్పటి నుంచి నా భర్త అనాస్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. బిడ్డ ప్రసవించే వరకు కంటికి రెప్పలా నా వెంటే ఉంటున్నాడు’ అని సనా చెప్పుకొచ్చింది. ఇక పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌పై కూడా సనా తన అభిప్రాయాలను పంచుకుంది. ‘మీరు ఇలాంటి డిప్రెషన్ల నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మికత వైపు మళ్లేందుకు ప్రయత్నించండి’ అని సనా సలహా ఇచ్చింది.
సనా వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ’10-12 మంది పిల్లలకు జన్మనివ్వడం అంత తేలికేనా?’ అని ఒకరు అడిగారు. “పని చేయడానికి నానీలు, పనిమనిషి ఉన్నప్పుడు మీరు ఈ విషయాలన్నీ చెప్పడం చాలా సులభం,” మరొకరు అన్నారు. ‘ఇంత జనాభా ఉన్న భారత్‌లో పది, పన్నెండు మంది పిల్లలకు జన్మనివ్వడం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడాలి’ అని ఇంకొకరు సనాపై మండిపడ్డారు. సనా ఖాన్ భర్త గుజరాత్‌లోని సూరత్. ముఫ్తీ అనస్ సయ్యద్ ఒక మత నాయకుడు, ఇస్లామిక్ పండితుడు. సనా ఎజాజ్ ఖాన్ ద్వారా ముఫ్తీకి పరిచయమైంది. ముఫ్తీ అనాస్ కూడా వ్యాపారవేత్త.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




