Shobha Shetty: శోభా శెట్టి సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ.. కారణమదేనా?
బిగ్ బాస్ తెలుగు ఫేమ్, కార్తీక దీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభా శెట్టికి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నెటిజన్లకు షాక్ ఇస్తూ శోభ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది.

కన్నడ బ్యూటీ శోభా శెట్టి తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ సీరియల్ అయిన కార్తీక దీపంలో విలన్ మోనితగా నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. అదే క్రేజ్ తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. హౌస్ లో శివాజీ బ్యాచ్ కు మాటకు మాట చెబుతూ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఫైనల్ వరకు వెళ్లకపోయినా తన ఆట, మాట తీరుతో చాలామందికి ఫేవరెట్ గా మారిపోయిందీ అందాల తార. ఆ తర్వాత కన్నడ బిగ్ బాస్ షోలోకి కూడా అడుగు పెట్టింది.అయితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేక హోస్ట్ కిచ్చా సుదీప్ ను విజ్ఞప్తి చేసి మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఈ మధ్యకాలంలో టీవీ షోస్ తప్పితే ఏ సీరియల్ లోనూ కనిపించడం లేదు శోభ. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ఫాలోవర్లకు బిగ్ షాక్ ఇచ్చింది మోనిత. ‘కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరం కాబోతున్నాను’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే శోభా శెట్టి ఇలా ఉన్నట్టుండి సోషల్ మీడియాకి దూరం కావడానికి కారణమేంటి? అంటూ అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
శోభా శెట్టి సోషల్ మీడియాకు దూరం కావడానికి వ్యక్తిగత సమస్యలే కారణమని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. కార్తీక దీపం 2 లో అవకాశం చేజారింది. అలాగే నిశ్చాతార్థం జరిగి ఏడాది గడిచింది. కానీ పెళ్లి మాట మాత్రం ఎత్తలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలుసింది. అది కూడా సాఫీగా జరగడం లేదని టాక్. ఇలా తాను అనుకున్నవీ ఏవీ జరగకపోవడంతో శోభ డిప్రెషన్ లోకి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకోవడానికి సోషల్ మీడియాకి కూడా దూరమైనట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడానికి సరైన కారణమేంటో శోభ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
శోభా శెట్టి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ప్రియుడితో ఎంగెజ్మెంట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








