AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్‌ మనసూ అందమైనదే.. పెళ్లికాకముందే 34 మంది అనాథ బాలికలకు అమ్మయింది.. ఎవరంటే?

ఈ స్టార్ హీరోయిన్ 2021లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. కానీ అంతకు ముందే 34 మంది అనాథ బాలికలకు అమ్మగా మారిందీ అందాల తార. పెళ్లికి ముందే వారిని దత్తత తీసుకుని అక్కున చేర్చుకుంది. బాలికలకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ ఆమెనే దగ్గరుండి చూసుకుంటోంది.

Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్‌ మనసూ అందమైనదే.. పెళ్లికాకముందే 34 మంది అనాథ బాలికలకు అమ్మయింది.. ఎవరంటే?
Bollywood Actress
Basha Shek
|

Updated on: Jun 04, 2025 | 4:33 PM

Share

సెలబ్రిటీలు పిల్లలను దత్తత తీసుకోవడం కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులను చూసుకుంటున్నారు. అయితే పెళ్లి కాకముందే కొంత మంది హీరోయిన్లు అనాథ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇలా ఇద్దరు అనాథ పిల్లలను దత్తత తీసుకుంది. అంతకు మందు రవీనా టాండన్, విశ్వ సుందరి సుస్మితా సేన్ కూడా ఇలాగే పెళ్లికి ముందే అనాథ పిల్లలను దత్తత తీసుకుని వార్తల్లో నిలిచారు. అయితే ఇదే జాబితాలో చాలా మందికి తెలియని ఒక హీరోయిన్ పేరు కూడా ఉంది. ఆమె ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 34 మంది అనాథ బాలికలను అక్కున చేర్చుకుంది. వారిని సొంత పిల్లల్లా చూసుకుంటూ చదువు నుంచి ఆహారం, దుస్తుల వరకు అన్నీ తనే సమకూరుస్తోంది. మరి ఇంత మంచి పని చేస్తున్నా బయటకు చెప్పుకోని ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా.

ప్రీతి జింటా 1998లో షారుఖ్ ఖాన్ చిత్రం ‘దిల్ సే’తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె ఒక చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత, ఆమె ‘క్యా కెహ్నా’ చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. తెలుగులోనూ ప్రేమంటే ఇదేరా, రాజ కుమారుడు సినిమాల్లోనూ నటించింది. సినిమా కెరీర్ పీక్స్ ఉండగానే 2016 లో వివాహం చేసుకుంది ప్రీతి. అయితే వివాహానికి ఏడు సంవత్సరాల ముందే ఆమె 34 మంది పిల్లలకు అమ్మయ్యింది.

34వ పుట్టిన రోజున..

ప్రీతి 2009లో 34వ వసంతంలోకి అడుగు పెట్టింది. తన పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మార్చుకునే క్రమంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అదే 34 మంది అనాథ బాలికలను దత్తత తీసుకోవాలనుకోవడం. ఈ అమ్మాయిలందరి బాధ్యత తనదేనని, సంవత్సరానికి రెండుసార్లు వారిని కలవడానికి రిషికేశ్‌కు వస్తానని కూడా అప్పట్లో ప్రీతి చెప్పింది.

ఐపీఎల్ లో ప్రీతి జింటా..

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలు..

ప్రీతి 2021లో సరోగసీ ద్వారా జే, జియా అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె పంజాబ్ కింగ్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తోంది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.