Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aneesha Dama: జార్జియాలో మాస్టర్స్ పూర్తి చేసిన గీతా గోవిందం నటి.. ఇప్పుడు చూస్తే కళ్లు తిప్పుకోలేరంతే..

గీతా గోవిందం, అర్జున్ రెడ్డి తదితర తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అనీషా దామా. తాజాగా ఈ బ్యూటీ జార్జియాలో ఇంటీరియర్ డిజైన్ కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా తన గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Aneesha Dama: జార్జియాలో మాస్టర్స్ పూర్తి చేసిన గీతా గోవిందం నటి.. ఇప్పుడు చూస్తే కళ్లు తిప్పుకోలేరంతే..
Aneesha Dama
Basha Shek
|

Updated on: Jun 07, 2025 | 1:33 PM

Share

అనీషా దామా..ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ.. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవర కొండ వెంట పడే అమ్మాయి ఇంటే గుర్తు పడతారు. ఈ సినిమాలో హీరో విజయ్ లెక్చరర్ గా కనిపిస్తే.. అతనిని పిచ్చిగా ప్రేమించే స్టూడెంట్ నీలు పాత్రలో అనీషా అద్భుతంగా నటించింది. ఇన్నోసెంట్ అమ్మాయిగా, క్యూట్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో అనీషా కనిపించేది కాసేపే అయినా తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. 2014లో ‘వయా పాపికొండలు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనీషా. ఆ తర్వాత 2017లో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో ఒక చిన్న రోల్‌లో నటించింది అనీషా. ఇక గీతా గోవిందం సినిమాతోనూ హిట్ కొట్టింది. దీని తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. , ‘మహర్షి’, ‘ఓ బేబీ’, ‘ఆల్ అబౌట్ మిచెల్’ ‘పెళ్ళికూతురు పార్టీ’, ‘సత్తిగాని రెండెకరాలు తదితర సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి మెప్పించింది. అఅలాగే ‘షైతాన్’ అనే వెబ్‌సిరీస్‌లో క్యామియో చేసింది అనీషా.

కాగా ఓ వైపు సినిమాలు చేస్తూనే ఉన్నత చదువులు అభ్యసిస్తోంది అనీష. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాస్టర్స్ పూర్తి చేసింది. జార్జియాలో ఇంటీరియర్ డిజైన్ కోర్స్ లో పీజీ పూర్తి చేసింది. ఈ సందర్భంగా గ్రాండ్ గా జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి కాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ఈ వేడుకలో అనీషాతో పాటు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా భాగమయ్యారు. తన ఫ్రెండ్స్ తో పాటు పేరెంట్స్ తో అమీషా దిగిన ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన పలువురు అనీషాకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో గీతా గోవిందం నటి..

View this post on Instagram

A post shared by Aneesha Dama (@aneeshadama)

కాగా అనీషాకు సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

గ్లామరస్ లుక్ లో అనీషా..

View this post on Instagram

A post shared by Aneesha Dama (@aneeshadama)

View this post on Instagram

A post shared by Aneesha Dama (@aneeshadama)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..