AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB: బెంగుళూరు తొక్కిసలాటకు వాళ్లే కారణం.. ఆ పని చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు.. హీరోయిన్ అసంతృప్తి..

ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఆర్సీబీ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేను శుక్రవారం అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

RCB: బెంగుళూరు తొక్కిసలాటకు వాళ్లే కారణం.. ఆ పని చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు.. హీరోయిన్ అసంతృప్తి..
Actress Ramya
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2025 | 12:55 PM

Share

ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ విజయాన్ని ఎంజాయ్ చేద్దామని వచ్చిన అభిమానులు చనిపోవడం ప్రతి ఒక్కరి హృదయాలను చలించివేసింది. ఈ ఘటనకు చాలా మంది అధికారులతో బాధ్యత అని ఆరోపించారు. మరోవైపు ఆర్సీబీ క్రీడాకారులు సైతం ఈ ఘటనకు బాధ్యులు అంటూ నెట్టింట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బెంగుళూరు తొక్కిసలాట ఘటనపై కన్నడ నటి రమ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్సీబీ విజయాన్ని చూద్దామని వచ్చిన అభిమానులు మరణించడం చాలా బాధకరమని అన్నారు.

“ఆర్సీబీ గెలిచిన రాత్రి, కర్ణాటక అంతటా వేడుకలు జరిగాయి. మాల్స్‌లో, వీధుల్లో ప్రజలు సంతోషంగా డ్యాన్స్ చేశారు. ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. తొక్కిసలాటలు జరగవు… అవి సృష్టించబడతాయి. ప్రభుత్వం, అధికారులు, ఆర్‌సిబి, పోలీసులు, కెఎస్‌సిఎ, ప్రజల సమిష్టి వైఫల్యం కారణంగా ఈ తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ విజయాన్ని జరుపుకోవడానికి వచ్చిన అమాయకులు చనిపోయారు. ఈ మరణాలకు గల కారణాలను కనుగొని న్యాయం అందించడానికి నిజాయితీగల ఆత్మపరిశీలన అవసరం. ఇక్కడి అధికారులను సస్పెండ్ చేయాలనే నిర్ణయం తొందరపాటు నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు నివేదిక కోసం వేచి ఉండాల్సింది” అని నటి రమ్య అభిప్రాయపడ్డారు.

“అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ మంచి ఉద్దేశాలే ఉన్నాయి. కానీ, ఒక ప్రణాళిక లేకుండా, సమన్వయ లోపం వల్ల ఇది జరిగింది. ఆటగాళ్లను ఒకే చోట సేకరించే బదులు ఓపెన్ బస్సులో ర్యాలీ చేసి ఉంటే, ఈ భయంకరమైన సంఘటన జరిగి ఉండేది కాదు ” అని రమ్య అన్నారు. ఒకప్పుడు సినిమాల్లో నటించిన రమ్య ఇప్పుడు నటనకు, రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అయితే, ఆమె తరచుగా సమాజంలోని పరిణామాలపై రియాక్ట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..