AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni : అఖిల్ అక్కినేని, జైనాబ్ రవ్జీ ఏం చదువుకున్నారో తెలుసా.. ? ఇద్దరి విద్యార్హతలు ఇవే..

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీని గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న అఖిల్.. జూన్ 6నఆ ఆమెతో కలిసి ఏడడుగులు వేశారు. వీరిద్దరి వివాహనికి సన్నిహితులు, సినీతారలు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Akhil Akkineni : అఖిల్ అక్కినేని, జైనాబ్ రవ్జీ ఏం చదువుకున్నారో తెలుసా.. ? ఇద్దరి విద్యార్హతలు ఇవే..
Akhil Wedding Photo
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2025 | 12:33 PM

Share

అక్కినేని అఖిల్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జూన్ 6న తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి వివాహం అక్కినేని నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారల హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జూన్ 8న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అక్కినేని అఖిల్ సతీమణి జైనాబ్ రవ్జీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే అఖిల్, జైనాబ్ విద్యార్హతల గురించి నెట్టింట తెగ ప్రచారం నడుస్తుంది. జైనాబ్ హైదరాబాద్‌లోని గీతాంజలి స్కూల్ మరియు నాసర్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె హామ్స్‌టెక్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ విద్యను పూర్తి చేసింది. అఖిల్ చైతన్య విద్యాలయంలో చదువుకున్నాడు. రెండేళ్లు ఆస్ట్రేలియాలో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అతను సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం నుండి బిబిఎ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాడు.

జైనాబ్ ప్రతిభావంతులైన కళాకారిణి, పెర్ఫ్యూమర్. బ్లాగర్. ఆమె 7 సంవత్సరాల వయస్సులో పెయింటింగ్ ప్రారంభించింది. ఆమె “వన్స్ అపాన్ ది స్కిన్” అనే బ్లాగును కూడా నడుపుతోంది. ప్రస్తుతం అఖిల్ సినీరంగంలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతె లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..