AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఎట్టకేలకు దొరికేసిందిరోయ్.. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమెనే.. అఫీషియల్ ప్రకటన..

పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు బన్నీ నటించనున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ పై విపరీతమైన క్యూరియాసిటి నెలకొంది. ఈ సినిమా గురించో రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

Allu Arjun: ఎట్టకేలకు దొరికేసిందిరోయ్.. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమెనే.. అఫీషియల్ ప్రకటన..
Allu Arjun, Atlee
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2025 | 11:25 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి తెలిసిందే. పుష్ప 2 సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమాలను సంపాదించుకున్నారు. దీంతో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చే చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని సమాచారం. అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏప్రిల్ 8న టీమ్ అధికారికంగా ప్రకటించింది. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా ఈ మూవీ నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై రోజుకో రూమర్ నడిచింది. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నారని టాక్ నడిచింది.

అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారని కొన్ని రోజులుగా సమాచారం. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ వీడియో సైతం రిలీజ్ చేశారు.

ఇప్పటికే దీపికా కల్కి 2898 ఏడీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోయే స్పిరిట్ చిత్రంలో నటించాల్సి ఉండగా.. అనుకోని కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్, అట్లీ మూవీలో దీపికా కనిపించనుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్