AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:19 ఏళ్లకే సినిమాల్లోకి.. అమ్మాయిల ఫేవరెట్.. ఇప్పుడు ఛాన్సుల్లేక.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?

బీటెక్ పూర్తికాగానే సినిమాల్లోకి హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. అయితే ఇప్పుడీ టాలీవుడ్ హీరోకు అవకాశాలు అంతగా రావడం లేదు.

Tollywood:19 ఏళ్లకే సినిమాల్లోకి.. అమ్మాయిల ఫేవరెట్.. ఇప్పుడు ఛాన్సుల్లేక.. ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jun 07, 2025 | 12:35 PM

Share

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించిన ఈ హీరో బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. 19 ఏళ్లకే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. లవ్ అండ్ రొమాంటిక్ మూవీతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ హీరోకు కూడా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కూడా యూత్ ఫుల్, లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే మధ్యలో ఈ హీరో నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గానూ సపోర్టింగ్ రోల్స్ చేశాడు. కొన్ని సినిమాల్లో విలన్ గానూ చేశాడు. అయితే ఈ హ్యాండ్సమ్ హీరోకు ఇప్పటివరకు సరైన బ్రేక్ రావడం లేదు. బిగ్ బాస్ లోనూ సందడి చేశాడు.. ఇది కొన్ని సినిమా అవకాశాలను తెచ్చిపెట్టిందే కానీ సరైన సక్సెస్ ఇవ్వలేకపోయింది. అయితే ఈ హీరో మాత్రం పట్టు వదలడం లేదు. సిక్స్ ప్యాక్ తోనూ అభిమాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ మధ్యన కొంచెం డిఫరెంట్ సినిమాలతో మన ముందుకు వస్తున్నాడు. మరి ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు బస్ స్టాప్ హీరో ప్రిన్స్ సెసిల్

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తోన్న ప్రిన్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘నేను 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. 21 ఏళ్ల వయసులో హీరోగా మారాను. ఆ తర్వాత నాకు సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్లు లేక ఇబ్బంది పడ్డాను. ఒక రకంగా చెప్పాలి అంటే, ఇది కూడా నా తప్పే. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎవరిలోనూ పెద్దగా కలిసే వాడిని కాదు. ఆ తప్పు వల్ల నాకు ఎవరితోనూ పరిచయం పెద్దగా ఏర్పడలేదు. అందుకే సరైన గైడెన్స్ లభించలేదు. దానివల్లే నేను హీరోగా నిలదొక్కుకోలేకపోయాను’ అని చెప్పుకొచ్చాడు ప్రిన్స్.

హీరో ప్రియదర్శితో ప్రిన్స్..

హీరో ప్రిన్స్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Prince Cecil (@princececil3)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..