AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Bendre: ‘క్యాన్సర్‌తో పోరాటం.. ఆ స్టార్ హీరో సాయం జీవితంలో మర్చిపోలేను’: సోనాలి బింద్రే

క్యాన్సర్ మహమ్మారిని ధైర్యంగా జయించిన వారిలో టాలీవుడ్ అందాల తార సోనాలి బింద్రే ఒకరు. 2018లో క్యాన్సర్ బారిన పడిన ఆమె న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకుంది. మనో ధైర్యంతో మహమ్మారిని జయించింది. అయితే ఈ కఠిన సమయంలో ఒక స్టార్ హీరో తనకు అండగా నిలబడ్డాడంటోంది సోనాలి.

Sonali Bendre: 'క్యాన్సర్‌తో పోరాటం.. ఆ స్టార్ హీరో సాయం జీవితంలో మర్చిపోలేను': సోనాలి బింద్రే
Sonali Bendre
Basha Shek
|

Updated on: Jun 08, 2025 | 7:34 PM

Share

మురారి సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించింది బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. పాకిస్తాన్ క్రికెటర్లు సైతం ఈ ముద్దుగుమ్మ అందానికి దాసోహమయ్యారంటే ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. ఇక హిందీలో అయితే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే క్యాన్సర్ బారిన పడింది సోనాలి. 2018లో క్యాన్సర్‌ సోకడంతో అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుందీ అందాల తార. మనో ధైర్యంతో మహమ్మారిని జయించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి తాను క్యాన్సర్‌ చికిత్స తీసుకున్న అనుభవాలను పంచుకుంది. ఆ క్లిష్ట సమయంలో తనకు ఓ స్టార్ ‍హీరో పూర్తి మద్దతుగా నిలిచారని తెలిపింది.

ఇవి కూడా చదవండి

‘ క్యాన్సర్‌ చికిత్స కోసం నేను అమెరికాలోని న్యూయార్క్ వెళ్లిపోయాను. ఆ సమయంలో నా ట్రీట్ మెంట్ గురించి సల్మాన్ ఖాన్ పదే పదే ఆరా తీశాడు. అంతే కాదు నేను చికిత్స పొందుతున్నప్పుడు ఒకటి కాదు.. ఏకంగా రెండుసార్లు న్యూయార్క్ వచ్చాడు. నాకు అత్యంత అవసరమైన సమయంలో హీరో సల్మాన్ ఖాన్‌ అండగా నిలిచాడు. అలాగే పలు సార్లు నా భర్తకు ఫోన్ చేసి అక్కడ సరైన వైద్యులు ఉన్నారో లేదో తెలుసుకున్నాడు. వారితో కూడా మాట్లాడాలని సల్మాన్‌ అడిగాడు’ అని సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది సోనాలి.

సోనాలి బింద్రే ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

కాగా 1999లో వచ్చిన ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమాలో జంటగా నటించారు సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ తీరుపై విమర్శలు చేసింది సోనాలి. ‘హమ్‌ సాత్‌ హై సినిమా షూటింగ్‌లో సల్మాన్‌ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లం. బయటకు కనిపించేంత కఠినాత్ముడు కాదు సల్మాన్’ అని సల్లూ భాయ్ గురించి చెప్పుకొచ్చిందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..