Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: ప్రభాస్ కల్కి 2 లో దీపిక నటించడం లేదా? అసలు విషయమిదిగో..

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తోన్న 'స్పిరిట్' సినిమాలో దీపిక పదుకొణె నటించడం లేదని ఖరారైంది. మొదట దీపికనే హీరోయిన్ అని ప్రచారం జరిగినా ఆ తర్వాత ఎందుకోగానీ ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

Deepika Padukone: ప్రభాస్ కల్కి 2 లో దీపిక నటించడం లేదా? అసలు విషయమిదిగో..
Deepika Padukone
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2025 | 6:57 PM

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో దీపికా పదుకొనేను హీరోయిన్‌గా నటించి ఉండేది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఇంతలోనే ఈ సినిమా వార్తల్లోకి ఎక్కింది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ నుంచి దీపికను తప్పించాడని, దీపికనే తప్పుకుందని.. ఇలా రకరకాల కథనాలు వైరలయ్యాయి. వీటితో పాటు స్పిరిట్ ఎఫెక్ట్ తో ‘కల్కి 2898 AD’ సినిమా సీక్వెల్ కూడా దీపిక చేతుల్లోంచి వెళ్లిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రభాస్ ‘కల్కి 2898 AD’లో దీపికా పదుకొనే ఒక ప్రధాన పాత్ర పోషించింది. దీని సీక్వెల్ సెట్ కావడానికి కొంత సమయం పడుతుంది. అయితే దీపికకు ‘స్పిరిట్’ బృందంతో ఇప్పటికే విభేదాలు ఉన్నందున, ప్రభాస్ ‘కల్కి 2’ కూడా దీపిక చేతుల్లోంచి వెళ్లిపోవచ్చునని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

‘కల్కి 2’ లో దీపికా పదుకొనే పాత్రకు చాలా ప్రాధాన్యముంది. రెండో పార్ట్ లో ఆమె రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉందనుందని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగం ఇప్పటికే విడుదలైంది కాబట్టి రెండవ భాగంలో దీపిక స్థానంలో మరో నటిని పెట్టడం సాధ్యం కాదు. కథలో కీలమైన పాత్ర కాబట్టి ఆమెను ఏ కారణం చేతనైనా చిత్ర బృందం నుంచి తప్పించే అవకాశం లేదు. అయితే కల్కి సీక్వెల్ సెట్ పై వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది.

దీపిక లేటెస్ట్ ఫొటో షూట్..

ఒక బిడ్డకు తల్లి అయిన దీపికా పదుకొనే రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననడం, ఎక్కువ పారితోషికం కూడా అడగడంతో సందీప్ రెడ్డి వంగానే దీపికను తప్పించడని వార్తలు వచ్చాయి. అదే సమయంలో కంటెంట్ నచ్చకపోవడంతోనే దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందని కూడా ప్రచారం జరుగుతోంది.

View this post on Instagram

A post shared by Adam Mosseri (@mosseri)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.