Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు నల్లగా దయ్యంలా ఉన్నావని వెక్కిరింతలు.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో అవమానాలు, వివక్షను ఎదుర్కొన్నవారు చాలా మందే ఉన్నారు. ఈ టాలీవుడ్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఓ స్టార్ కమెడియన్ కూతురై ఉండి కూడా ఈమెకు బాడీ షేమింగ్ తప్పలేదు.

Tollywood: ఒకప్పుడు నల్లగా దయ్యంలా ఉన్నావని వెక్కిరింతలు.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2025 | 6:20 PM

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ పాప ఒక స్టార్ కమెడియన్ కూతురు. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. అయితే ఓ స్టార్ కమెడియన్ కూతురైన తాను చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు, వివక్షను ఎదుర్కొన్నానంటోందీ అందాల తార. ముఖ్యంగా బాడీ కలర్ విషయంలో తనను చాలా మంది ఎగతాళి చేశారంటోంది. ‘నేను చూడడానికి ఒకింత నల్లగా ఉంటాను. కానీ శరీర రంగు విషయంలో నేనెప్పుడూ బాధపడింది లేదు. కానీ రంగు మాత్రమే కాకుండా శరీరాకృతి విషయంలో సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. నువ్వు అందవిహీనంగా ఉన్నావు. నల్లగా దెయ్యంలా ఉన్నావు. సినిమా ఇండస్ట్రీలో నీకు పని దొరకడం కష్టం. చిన్నతనం నుంచి నా రంగు విషయంలో ఇలాంటి మాటలే వింటున్నాను. నన్ను చూసిన వాళ్లు.. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇచ్చేవారు. జీవితంలో నేను విజయం సాధించాలంటే ముందు తెల్లగా మారాలని అందరూ అనుకున్నారు. శరీర రంగు అనేది మన సమాజంలో ఉన్న సమస్య’ అని వాపోయిందీ అందాల తార. అయితే అవమానాలనే విజయానికి మెట్లుగా మార్చుకుందీ అందాల తార. ట్యాలెంట్ కు, కలర్ కు అసలు సంబంధం లేదని నిరూపించింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్‌ ప్రముఖ హాస్య నటుడు జానీ లీవర్‌ కుమార్తె, హీరోయిన్ జేమీ లీవర్‌.

ఇవి కూడా చదవండి

జానీ లివర్ లాగే అతని కుమార్తె జేమీ లివర్ కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హిందీలో హౌజ్‌ఫుల్‌ 4’, ‘బూత్‌ పోలీస్‌’ లాంటి చిత్రాలతో క్రేజ్ దక్కించుకుందీ అందాల తార. ఇక గతేడాది విడుదలైన ‘ఆ ఒక్కటీ అడక్కు’తో టాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది జేమీ. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

జేమీ లివర్ కు సోషల్ మీడియాలో భారీ అభిమానులు ఉన్నారు. తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి జేమీ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి లైక్స, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

తండ్రితో కలిసి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..