Tollywood: కెరీర్ పీక్స్‌లో యాక్సిడెంట్.. మూడేళ్లు బెడ్‌పైనే.. ఇప్పుడు మళ్లీ హీరోయిన్‌గా బిజీ.. గుర్తు పట్టారా?
చాలా మంది హీరోయిన్ల లాగే ఈ ముద్దుగుమ్మ కూడా మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆపై ఒక సూపర్ హిట్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది... కానీ..

మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుందీ అందాల తార. అరంగేట్రంలోనే శివ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆపై తెలుగులోనూ రామ్ పొతినేని, రవితేజ, సాయి ధరమ్ తేజ్, సుధీర్ బాబు, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తదితర యంగ్ అండ్ సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా మెరిసింది. కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. అయితే ఉన్నట్లుండి సినిమాలకు దూరమైందీ అందాల తార. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడేళ్లు కెమెరా ముందుకు రాలేదు. సోషల్ మీడియాలోనూ సందడి లేదు దీంతో ఈ ముద్దుగుమ్మకు ఏమైపోయిందోనని సినీ అభిమానులు కలవరపడ్డారు. అయితే ఒక రోజు సోషల్ మీడియా ద్వారా టచ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ సంచలన విషయాన్ని బయట పెట్టింది. తనకు యాక్సిడెంట్ అయ్యిందని, అదృష్టం కొద్దీ ప్రాణాపాయం తప్పిందని చెప్పుకొచ్చింది. సుమారు మూడేళ్లు బెడ్ పైనే ఉన్నానంటూ తెలిపింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఇస్మార్ట్ పోరీ నభా నటేష్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. అందులో ఉన్నది నభా మాతృమూర్తి.
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నభా నటేష్. ఆ తర్వాత రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకుంది. డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స, మ్యాస్ట్రో సినిమాలతో తెలుగు సినిమా ఆడియెన్స్ కు మరింత చేరువైందీ అందాల తార. 2021 తర్వాత సుమారు మూడేళ్ల పాటు సినిమాల్లో కనిపించలేదు నభా నటేష్. దీనికి కారణం యాక్సిడెంట్. ఒక ప్రమాదంలో నభా తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమె సుమారు మూడేళ్లు బెడ్ పైనే ఉండాల్సి వచ్చింది.
చీర కట్టులో నభా నటేష్ పోజులు..
View this post on Instagram
కాగా గతేడాది డార్లింగ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది నభా. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ బ్యూటీ తర్వాతి సినిమాలపై అధికారిక అప్డేట్స్ రావాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.