Aamir Khan: తనకంటే 23 ఏళ్లు చిన్నదైన జెనీలియాతో రొమాన్స్.. ఆమిర్ ఖాన్ ఏమన్నాడంటే?
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు. ఇక నటి జెనీలియా దేశ్‌ముఖ్ సుమారు వయసు 37 సంవత్సరాలు. ఇప్పుడు 'సితారే జమీన్ పర్' చిత్రంలో కలిసి నటించారు. కాగా తమ ఏజ్ గ్యాప్ పై వస్తోన్న ట్రోల్స్ పై ఆమిర్ ఖాన్ ఇలా స్పందించాడు.

స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కు బాలీవుడ్ నటుడు ఉన్న మరో పేరు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. దీనికి తగ్గట్టుగానే ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆమిర్ ఖాన్ దానికి ప్రాణం పోస్తాడు. కుర్రాడిలా కనిపించమన్నా అందుకు తగ్గట్టుగా మారిపోతాడు. అలాగే వృద్ధుడిలా నటించమన్నా అందుకు తగ్గట్టుగానే బరువు పెంచుకుంటాడు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ సినిమాలో దాదాపు 40 ఏళ్ల వ్యక్తి పాత్రను పోషిస్తున్నాడు. నిజ జీవితంలో ఆమిర్ ఖాన్ సుమారు వయసు 60 సంవత్సరాలు! ఈ సినిమాలో ఆమిర్ జెనీలియా దేశ్ ముఖ్ తో జత కట్టాడు. ఆమె వయసు ఇప్పుడు సుమారు 37 సంవత్సరాలు. ఆమిర్ ఖాన్, జెనీలియా మధ్య సుమారు 23 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. అయితేనేం ‘సితారే జమీన్ పర్’ చిత్రంలో కలిసి నటించారు. ఆశ్చర్యకరంగా జెనీలియా ఒకప్పుడు ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో హీరోయిన్ గా జతకట్టింది! ఇప్పుడు ఆమిర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి ఏజ్ గ్యాప్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ విమర్శలపై ఆమిర్ ఖాన్ స్పందించాడు.
తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమిర్ ఖాన్ నటులు, నటీమణుల మధ్య వయస్సు అంతరం గురించి స్పందించాడు. “చాలా కాలం క్రితం, ఇమ్రాన్ ఖాన్ జెనీలియాతో జత కట్టింది. కానీ ఇప్పుడు ఇమ్రాన్ నా వయస్సువాడిలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో నేను, జెనీలియా 40 ఏళ్ల వయసు ఉన్నవారి పాత్రలు పోషించాం. జెనీలియా ఇప్పుడు దాదాపు ఆ వయసులోనే ఉంది కదా. నాకు ఇప్పుడు 60 ఏళ్లు. ఇప్పుడు మన దగ్గర VFX టెక్నాలజీ ఉంది. కానీ గతంలో, నేను 18 ఏళ్ల పాత్ర పోషించాల్సి వస్తే.. నేను ప్రోస్తేటిక్స్ మేకప్ చేయించుకోవాల్సి వచ్చేది. 1989లో, అనిల్ కపూర్ 80 ఏళ్ల వ్యక్తి పాత్రను పోషించాడు. అప్పుడు అతను యువకుడు. ఇప్పుడు, VFX విషయంలో, నటులకు వయోపరిమితి లేదు’ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.
సితారే జమీన్ పర్ లో ఆమిర్ ఖాన్, జెనీలియా..
I am excited to see the onscreen chemistry of this unconventional pairing of Aamir Khan and Genelia ❤️🔥 pic.twitter.com/orJVIHJnrr
— Debi (@WhoDebi) May 29, 2025
‘సితారే జమీన్ పర్’ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఇది ‘ఛాంపియన్స్’ సినిమాకి రీమేక్. ఈ సినిమాలో చాలా మంది కొత్త ఆర్టిస్టులు నటించారు.
Aamir Khan y Genelia Deshmukh en Bollywood Hungama Style Icons Summit 2025#SitaareZameenPar #GeneliaDeshmukh #AamirKhan #AamirKhanproductions #AamirKhanFCPerú pic.twitter.com/1TSzPvWlWd
— Aamir Khan FC Perú 🇵🇪 (@aamir_peru) June 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.