Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్‌ను ముక్కలుచేస్తున్న పర్సంటేజీలు.. సింగిల్‌ స్క్రీన్‌లు! ఆ నలుగురిలో లేనంటూ..

'ఎవరో జ్వాలను రగిలించారు.. మరెవరో దానికి బలి అయ్యారు' అనే పాట గుర్తొస్తోంది ఈ సందర్భంలో. పక్కన కూర్చున్నవాళ్లు ఏదో మాట్లాడితే... ఆ ప్రభావం మరొకరిపై పడింది. మాట్లాడింది ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్‌ అయితే.. ఆ ప్రభావం పడింది ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ అయిన సునీల్‌ నారంగ్‌పై...

Tollywood: టాలీవుడ్‌ను ముక్కలుచేస్తున్న  పర్సంటేజీలు.. సింగిల్‌ స్క్రీన్‌లు! ఆ నలుగురిలో లేనంటూ..
Silver Screen Issue
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 09, 2025 | 10:45 PM

‘ఎవరో జ్వాలను రగిలించారు.. మరెవరో దానికి బలి అయ్యారు’ అనే పాట గుర్తొస్తోంది ఈ సందర్భంలో. పక్కన కూర్చున్నవాళ్లు ఏదో మాట్లాడితే… ఆ ప్రభావం మరొకరిపై పడింది. మాట్లాడింది ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్‌ అయితే.. ఆ ప్రభావం పడింది ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ అయిన సునీల్‌ నారంగ్‌పై. ఏకంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అది కూడా అధ్యక్షుడిగా ఎన్నికై ఒక రోజు కూడా గడవక ముందే. ఈ గ్యాప్‌లో ఏం జరిగి ఉంటుందా అని తలలు బద్దలుకొట్టుకుంటున్నారంతా. అయితే.. ఓ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు.. చిన్నవాళ్లు కాదు అగ్రనిర్మాతలే.. నారంగ్‌ను బ్లేమ్‌ చేసేలా మాట్లాడారని ఓ టాక్‌. రిజైన్‌ వెనక రీజన్‌ అదేనంటున్నారు. ఇంతకీ.. ఈ వివాదం వెనక చెప్పుకోవాల్సిన బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటి సునీల్‌ నారంగ్.. వరుసగా మూడోసారి తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కి రెండేళ్లకోసారి ఎలక్షన్స్‌ జరగడం కామన్‌. దాదాపుగా ఆ ఎన్నికలు ఏకగ్రీవం అవుతుంటాయి. ఈసారి కూడా ఏకగ్రీవం అయింది. సునీల్‌ నారంగ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. సో, కొత్త కమిటీని అందరికీ పరిచయం చేయడానికి ఓ ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. రచ్చంతా జరిగింది ఆ ప్రెస్‌మీట్‌లోనే కాబట్టి. శ్రీధర్.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ ఇతను. ఇదీ తమ కొత్త టీమ్‌ అని చెప్పి వెళ్లిపోవాల్సిన వ్యక్తి… కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి