Happy Birthday Balayya: శతాధిక చిత్రాల బాలయ్య బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
నటసింహం హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందడి మొదలైంది. బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా సెలబ్రేటీలు, అభిమానులు భారీ స్థాయిలో జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా బాలయ్య బాబుకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందశారు.

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి అందగాడు హిందూ పూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు తన 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. బాలయ్య పుట్టిన రోజు హవాతో సోషల్ మీడియాలో షేక్ అవుతుంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ , నారా రోహిత్, బాలయ్య కూతురు తేజస్విని, గోపీచంద్ మలినేని, బాబీ వంటివారు తమ ప్రేమని తెలియజేస్తూ బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టిడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెతెలియజేశారు.
శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు పవన్ కళ్యాణ్. అంతేకాదు చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలను పోషించి మెప్పు పొందిన హీరో.. ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.. బాలకృష్ణకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు అందించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఓ వైపు బాలకృష్ణకు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు విషెస్ చెబుతూ తమ ప్రేమను చాటుకున్నారు. మరోవైపు బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా రిలీజైన అఖండ 2 టైటిల్ టీజర్ ఇప్పటికే ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.
కుటుంబానికే అధిక ప్రాధాన్యతను ఇచ్చే మా నాన్నకి హ్యాపీ బర్త్ డే.. మీరే నా హీరో.. మీరే నా స్పూర్తి.. హ్యాపీ బర్త్ డే నాన్నా అని కూతురు తేజస్వీ విషెస్ చెప్పగా.. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అని కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..