Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: త్వరలో మిథున రాశిలోకి సూర్యుడు.. ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..

నవ గ్రహాలకు అధినేత.. ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు ఈ నెలలో మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిలోనే నెల రోజులు ఉండనున్నాడు. ఇప్పటికే మిథున రాశిలో ఉన్న బుధుడు, గురువు కలయిక తో త్రిగ్రాహి యోగం ఏర్పనుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. వ్యాపారంలో పురోగతి, ఉద్యోగంలో ప్రమోషన్ , స్థల మార్పు అవకాశాలు ఉన్నాయి.

Astro Tips: త్వరలో మిథున రాశిలోకి సూర్యుడు.. ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2025 | 11:23 AM

గ్రహాల రాజు సూర్యుడు తన మిత్ర రాశి వృషభ రాశిని వదిలి బుధుడు అధిపతి అయిన మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడి ఈ సంచారంతో కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్య సంచారము జూన్ 15, 2025 ఆదివారం నాడు జరుగుతుంది. ఈ సంచారమును మిథున సంక్రాంతి అని కూడా పిలుస్తారు. సూర్యుడు మిథున రాశిలో దాదాపు ఒక నెల పాటు ఉంటాడు. జ్యోతిషశాస్త్ర దృక్పథం ప్రకారం, ఈ సమయంలో మిథున రాశిలో సూర్యుడు, బుధుడు , గురువుల కలయిక జరిగి త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి (గురువు)మిథున రాశిలోకి వచ్చాడు . బుధుడు కూడా మిథున రాశిలో ఉన్నాడు. సూర్యుడు, గురువుల కలయిక ద్వారా గురు ఆదిత్య రాజ్యయోగం కూడా ఏర్పడుతుంది. ఇది అనేక రాశులకు శుభప్రదమైనది. ఫలవంతమైనది అని నిరూపించబడుతుంది. సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఏ రాశులకు కలిసి వస్తుందో తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి అదృష్టం మెరుస్తుంది

  1. మిథున రాశి: సూర్యుడు ఈ రాశి లగ్నం (మొదటి ఇల్లు)లోకి ప్రవేశిస్తున్నాడు. ఇది వీరి ఆత్మవిశ్వాసం, శక్తి,వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందవచ్చు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు. పాత ఆరోగ్య సమస్యలు మెరుగుపడవచ్చు. సంబంధాలలో అవగాహన పెరుగుతుంది. వీరి జాతకంలో సూర్యుడు, బుధుడు, బృహస్పతి కలయిక ద్వారా శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతోంది, ఇది వీరికి గౌరవం, స్థానం, ప్రతిష్ట, ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది.
  2. సింహరాశి:ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇప్పుడు సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించడం వలన వీరి ఆదాయ గృహం (11వ ఇల్లు)లో ఉంటుంది. ఇది కొత్త ఆదాయ వనరులను తెరుస్తుంది, పెండింగ్‌లో ఉన్న డబ్బు అందుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆఫీసులో పనికి తగిన గుర్తింపు పొందుతారు. సీనియర్ల మద్దతు లభిస్తుంది. పదోన్నతి అవకాశాలు ఉంటాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. సింహరాశి అధిపతి సూర్యుని ఈ సంచారము వీరికి చాలా అదృష్టాన్ని ఇస్తుంది.
  3. తుల రాశి: సూర్యుడు వీరి భాగ్య భావంలో (9వ ఇంట్లో) ప్రవేశిస్తాడు. ఇది వీరికి అదృష్టం కలిసి వస్తుంది. దీంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనిలో విజయం పొందవచ్చు. ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. మతపరమైన,ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. వీరికి తండ్రి , గురువుల మద్దతు కూడా లభిస్తుంది.
  4. కుంభరాశి: సూర్యుడు వీరి ఐదవ ఇంట్లోకి (పిల్లలు, విద్య, ప్రేమ) సంచరిస్తాడు. దీంతో వీరు పిల్లల నుంచి శుభవార్త వింటారు. విద్యా రంగంలో విజయం పొందుతారు. ప్రేమ సంబంధాలు, మధురంగా ​​మారతాయి. వీరికి నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలుగవచ్చు.
  5. ధనుస్సు: సూర్యుడు వీరి ఏడవ ఇంట్లోకి (వివాహం, భాగస్వామ్యం) సంచరించనున్నాడు. ఈ సంచారం వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని తెస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపార భాగస్వామ్యంలో లాభం ఉంటుంది. కొత్త ఒప్పందాలను పొందవచ్చు. జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉండవచ్చు. ఆకస్మిక ధన లాభాలకు అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటు ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు. స్థానం కూడా మారవచ్చు.

సూర్యుడి మార్పుతో రాశులపై ప్రభావం

సూర్యుని సంచారము అన్ని రాశులపై వేర్వేరు ప్రభావాలను చూపుతుంది. వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి రాశిలపై వేర్వేరు ప్రభావాలు ఉండవచ్చు. మిథునరాశిలో సూర్యుని సంచారము అనేక రాశులకు శుభకరమైన, సానుకూల మార్పులను తీసుకురాబోతోంది, ముఖ్యంగా ఈ సంచారము కెరీర్, ఆర్థిక , సంబంధాలలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.