Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Anklets: స్త్రీలు వెండి పట్టీలు ధరించే సంప్రదాయం వెనుక.. సైంటిఫిక్ రీజన్ .. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే..

భారతీయ సంస్కృతిలో స్త్రీ అలంకరణలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, నుదిటి నుంచి కాలి వేళ్ళ వరకూ రకరకాల రకరకాల ఆభరణాలను ధరిస్తారు. వీటిల్లో వేటికవే ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు ధరించే పట్టీలు, అది కూడా వెండి పట్టీలను ధరించడం కేవలం అది ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. దాని వెనుక లోతైన ఆధ్యాత్మికత, శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం.

Silver Anklets: స్త్రీలు వెండి పట్టీలు ధరించే సంప్రదాయం వెనుక.. సైంటిఫిక్ రీజన్ .. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే..
Silver Anklets
Follow us
Surya Kala

|

Updated on: Jun 08, 2025 | 10:13 AM

భారతీయ సంప్రదాయాలలో.. స్త్రీ, పురుషులు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మహిళలకు అందాన్ని, ప్రత్యేకతను ఇచ్చేవి వెండి పట్టీలను ధరించడం. స్త్రీలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమ పాదాలకు వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది. భారతీయ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కనుక పసిడి తోచేసిన నగలను పాదాలకు ధరించరు. అయితే పాదాలకు వెండి పట్టీలు ధరించడం గౌరవనీయమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది అలంకరణ లో ఒక భాగం మాత్రమే కాదు.. దాని వెనుక అనేక మతపరమైన, శాస్త్రీయ, ఆయుర్వేద కారణాలు ఉన్నాయి. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

  1. అదృష్టానికి చిహ్నం హిందూ మతంలో వెండి పట్టీలను ధరించడం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీల వైవాహిక జీవిత ఆనందానికి సంకేతం. వీటిని ధరించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సంతోషం వస్తాయి.
  2. సానుకూల శక్తి ప్రసారం వెండిని చల్లదనం, శాంతి, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. వెండి పట్టీలు ధరించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని.. ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. పట్టీల గలగల అనే మధురమైన శబ్దం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.
  3. చంద్రుడికి, శుక్ర గ్రహానికి సంబంధం జ్యోతిషశాస్త్రం ప్రకారం వెండి చంద్రునికి, శుక్ర గ్రహానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు, శాంతిని అందిస్తాడు. అయితే శుక్రుడు ప్రేమ, అందం, కళ, వైవాహిక ఆనందానికి కారకుడు. వెండి పట్టీలు ధరించడం వల్ల ఈ గ్రహాలు బలపడతాయి. అప్పుడు వివాహ జీవితంలో మాధుర్యం, శ్రేయస్సును తెస్తాయి.
  4. శక్తి పరిరక్షణ శాస్త్రీయ ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలు శరీర శక్తి పాదాల ద్వారా బయటకు వస్తుందని నమ్ముతారు. వెండి పట్టీలు ధరించడం ద్వారా ఈ శక్తి శరీరం లోపల ఉంటుంది. ఇది శరీరంలో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది.
  5. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది చీలమండలు దగ్గర పట్టీలను ధరించడం వల్ల పాదాలలోని కొన్ని బిందువులపై ఒత్తిడి పడుతుంది. ఇవి ఆక్యుప్రెషర్ సూత్రంపై పనిచేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పాదాలలో వాపు, నొప్పి మొదలైన సమస్యలను తగ్గిస్తుంది.
  6. హార్మోన్ల సమతుల్యత వెండి పట్టీలను ధరించడం వల్ల మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడుతుందని, ఇది ఋతు సమస్యలు, ఇతర హార్మోన్ల అసమతుల్యతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి.
  7. వ్యాధి నిరోధకత వెండిలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. వెండిని పాదాలకు ధరించడం వల్ల శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అవకాశం ఉందని నమ్మకం.
  8. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వెండి లోహం శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  9. అందువల్ల వెండి పట్టీలు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. అవి భారతీయ సంస్కృతిలో ఒక లోతైన సంప్రదాయంలో భాగం. దీని వెనుక మత విశ్వాసాలు, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇవి మహిళల అందాన్ని పెంచడమే కాదు.. మహిళలకు ఆరోగ్యం, అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.