Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీ సంబంధాల్లో చికాకులు తలెత్తకుండా ఉండాలంటే.. చాణక్య చెప్పిన ఈ విషయాలు పాటించండి.

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. సంబంధాలను నిలబెట్టుకోవడం ఒక కళ. ఇలా సంబంధాలు నిర్వహించాలంటే అహంకారాన్ని తగ్గించుకోవడం ముఖ్యం. సంబంధాలలో వచ్చే చికాకును నివారించడానికి.. ఒకరినొకరు గౌరవించుకోండి. ఎవరినీ ఎప్పుడూ కించపరచకండి. అదే సమయంలో ఎవరికీ మీగురించి రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి.. ఎందుకంటే ఈ రోజు స్నేహితుడిగా ఉన్నవాడు రేపు శత్రువుగా మారవచ్చు.

Chanakya Niti: మీ సంబంధాల్లో చికాకులు తలెత్తకుండా ఉండాలంటే.. చాణక్య చెప్పిన ఈ విషయాలు పాటించండి.
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Jun 08, 2025 | 10:52 AM

ఈ సమస్త ప్రపంచంలో, కుటుంబం, స్నేహితులు, జీవిత భాగస్వామి ఇలా ప్రతి ఒక్కరికీ ఒకొక్క ప్రపంచం ఉంటుంది. ఎవరికైనా దుఃఖం కలిగితే కుటుంబ సభ్యులు, స్నేహితులు మీతో ఉంటారు. అయినప్పటికీ మీకు బాధని కలిగించే విషయాలను ఎవరితోనూ విషయాలు పంచుకోలేకపోతే.. ఈ విషయాలను స్నేహితులతో చెబుతారు, మీ కష్టం, దుఖం గురించి స్నేహితులకు పంచుకుంటారు.

ఒకొక్కసారి మీ స్నేహితులతో కూడా చెప్పలేని విషయాలను మీ జీవిత భాగస్వామికి చెబుతారు. అప్పుడు మీకు కలిగిన దుఖం, బాధ తగ్గుతుంది. కొన్నిసార్లు మీకు సరైన సలహా కూడా లభిస్తాయి. అదే సమయంలో ఆనందాన్ని పంచుకోవడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి సహవాసం అవసరం. అయితే కొన్నిసార్లు కొంత అపార్థం లేదా గర్వం కారణంగా ఈ సంబంధాలు చెడిపోతాయి. వాటిని సకాలంలో తొలగించకపోతే.. అది సంబంధాల మధ్య అంతరాన్ని సృష్టిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మర్చిపోయే స్టేజ్ కి వైరం చేరుకుంటుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు.

ఆచార్య చాణక్యుడు మీ సంబంధాలలో ఎటువంటి చీలికలు రాకుండా కొన్ని చిట్కాలను తన నీతి శాస్త్రంలో చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఏ విషయాలను పక్కకు పెట్టాలో తెలుసుకోవాలి… సంబంధాలను నిర్వహించడం ఒక కళ. మీ కుటుంబంలోని ప్రతి సభ్యుడు, ప్రతి స్నేహితుడు, జీవిత భాగస్వామి ఆలోచనలు మీ ఆలోచనల వలనే ఉండవు. ఉండవలసిన అవసరం లేదు. అటువంటి పరిస్థితిలో.. సంబంధాలను నిర్వహించడం ఒక కళ. చాణక్య నీతి ప్రకారం సంబంధాలను నిర్వహించడానికి (సంబంధాలలో విభేదాలను ఎలా నివారించాలి) అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వ్యక్తులకు గర్వం ఉండకూడదు.

అహంకారం ఏ సంబంధాన్ని అయినా బలహీనపరుస్తుంది. అందువల్ల మీరు ఎంత డబ్బు సంపాదించినా.. పురోగతి మార్గంలో ఎంత దూరం వెళ్ళినా.. ఈ సంబంధాలలో మీ అహం ప్రతిబింబించనివ్వకండి. ఒకరినొకరు గౌరవించుకోండి. ఇతరులను అవమానించడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి.

మీ రహస్యాలను పంచుకోవద్దు మీ జీవితంలోని అతి సున్నితమైన రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. వాస్తవానికి ఈ రోజు మీకు స్నేహితుడిగా ఉన్న వ్యక్తి రేపు శత్రువు కూడా కావచ్చు. అప్పుడు మీరు పంచుకున్న రహస్యం అప్పుడు అతనికి ఆయుధంగా పనిచేస్తుంది. కనుక మీ రహస్యాన్ని మీలోనే ఉంచుకోండి. ప్రతికూలతను నివారించండి. నిజమైన స్నేహితులు, భాగస్వామి, కుటుంబం మీ నిజమైన బలం. వారిని గౌరవించండి.. పరిస్థితి ఎలా ఉన్నా సరే వారికి అబద్ధం చెప్పకండి లేదా వారిని మోసం చేయకండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి ఎందుకంటే కోపంలో ఒక క్షణం చాలు సంబంధాన్ని దెబ్బతీయడానికి.. అంతేకాదు ఎవరైనా కోపంలో చెప్పిన దానికి ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.