AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కాకినాడ కుర్రోడి అద్భుత సృష్టి.. సరికొత్త ఆలోచనలో అడ్జెస్ట్ వాహనం తయారీ..

కాకినాడ కుర్రాడు ఒక అద్భుతం సృష్టించాడు.. అవసరం మేరకు వాహనం పరిణామములో మార్పులు చేసేలా ఆవిష్కరణ చేశారు.. తనకు ప్రోత్సాహం అందిస్తే తన దగ్గర మరింత క్రియేటివిటీ ఉందంటున్నాడు.. ఎంతమంది అవసరమైతే అతమంది మాత్రమే బ్యాటరీ వాహనంలో కూర్చునేలా డిజైన్ చేసాడు.

Andhra Pradesh: కాకినాడ కుర్రోడి అద్భుత సృష్టి.. సరికొత్త ఆలోచనలో అడ్జెస్ట్ వాహనం తయారీ..
Size Adjustable Car
Pvv Satyanarayana
| Edited By: Surya Kala|

Updated on: Jun 08, 2025 | 9:38 AM

Share

మామూలుగా మన దగ్గర ఉన్న వాహనం కొన్న దగ్గర నుంచి దాని లైఫ్ టైం ముగిసే వరకు ఒకే విధంగా ఉంటుంది. మన అవసరాల దృష్టిలో దానిని ఎటువంటి మార్పు రాదు కానీ కాకినాడ కు చెందిన సుధీర్ టెక్నాలజీ సాయంతో సరికొత్త ఒరవడి సృష్టించాడు. ఇరుకు సందులు ట్రాఫిక్ ,సమయాలలో వెహికల్ సైజ్ తగ్గించుకునేలా కొత్త క్రియేటివిటీ బయట పెట్టాడు. కారులో ఒక్కరు మాత్రమే వెళ్లాల్సిన సమయంలో మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. దాని వలన ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. కానీ సుధీర్ సరికొత్త ఆలోచన వలన వెహికల్ లో ఎంతమంది ఉన్నారు.. అంతమందికి తగ్గట్టు వాహనం సైజు తగ్గిపోతుంది. మళ్లీ మనకి కావాలంటే దాని పరిణామం పెరుగుతుంది. రద్దీగా ఉండే మెట్రో సిటీ లులో ఇటువంటి వాటి అవసరాలు చాలా ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. దానికోసం సుదీర్ ఎంతో రీసెర్చ్ చేశాడు.. తన ఆలోచనలను ఆచరణలో పెట్టాడు. దానికోసం డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి. అసలే అంతంత మాత్రం అయిన ఫ్యామిలీ అయినప్పటికీ కొడుకును తండ్రి ఎంకరేజ్ చేశాడు. సుధీర్ కి తల్లి లేదు.. ఆ లోటు రానివ్వకుండా అద్భుతాలు సృష్టించడానికి పునాదులు వేశాడు.

వాహనం మినిమైజ్ అవడానికి చేసిన ప్రయోగం కోసం దాదాపు 3 లక్షల వరకు ఖర్చయింది అంటున్నారు సుధీర్. వాహనం స్టీరింగ్ మిగతా పార్ట్ లు అడ్జస్ట్ అవ్వడానికి చాలా వర్క్ అవుట్ చేశాడు. తన దగ్గర ఇలాంటి 26 ఐడియాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టించి తనను తాను నిరూపించికుంటానని ధీమాని వ్యక్తం చేస్తున్నాడు. ఇండియన్ రైల్వే ఆర్మీకి ఉపయోగపడేలా సరికొత్త టెక్నాలజీ ఆలోచనలు సుధీర్ దగ్గర ఉన్నాయి.. వాటిని ఆచరణలోకి పెట్టాలంటే పెట్టుబడి అవసరమవుతుంది.

ఇవి కూడా చదవండి

తెలుగు సినిమాలో ఒక కారు అప్పటికప్పుడు రకరకాలు గా మారిపోతుంది. కానీ రియాల్టీలో కూడా అలాంటివి అనుకుంటే జరుగుతాయని సుధీర్ చేసి చూపించాడు.. ఈ వాహనం బ్యాటరీ సపోర్టుతో నడుస్తుంది.. దీనిని ఒకసారి పరిశీలించాలని సుధీర్ కోరుతున్నాడు.. సుదీర్ కు చిన్నప్పటి నుంచి కొత్త ఇన్నోవేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని స్నేహితులు చెప్తున్నారు.. ప్రతి విషయాన్ని వేరే కోణంలో ఆలోచిస్తాడు సుధీర్.. దానికి అనుగుణంగా సపోర్ట్ కోరుతున్నాడు. ఒక్కడే ఇంత సక్సెస్ అవ్వడానికి. కష్టపడి పని చేశాడు.

మొత్తానికి అందరిలా కాకుండా కొత్తగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు సుధీర్.. దానికి అనుగుణంగా మినిమైజ్ వాహనాన్ని డిజైన్ చేశాడు. దానిని పూర్తిస్థాయిలో అబ్జర్వ్ చేయాలని కోరుతున్నాడు. ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తూ మరింత అడ్వాన్స్గా ముందుకు వెళ్తానని చెబుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..