Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Queen of Indian Vegetables: మన కూరగాయాల్లో రాణి ఎవరో తెలుసా.. దీనిని తినడం వలన లాభాలు, నష్టాలు ఏమిటంటే..

బంగాళాదుంపను కూరగాయలకు రాజు అంటారు కానీ చాలా తక్కువ మందికి మాత్రమే కూరగాయలకు రాణి గురించి తెలుసు. సాధారణంగా కూరగాయలకు రాణి గురించి ప్రజలకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అయితే ఈ రోజు కురగాయాల్లో రాణి ఎవరు? ఈ దీనితో చేసిన పదార్ధాలు ఎవరు తినవచ్చు? ఎవరు తినకూదదో తెలుసుకుందాం,..

Queen of  Indian Vegetables: మన కూరగాయాల్లో రాణి ఎవరో తెలుసా.. దీనిని తినడం వలన లాభాలు, నష్టాలు ఏమిటంటే..
Queen Of Vegetables
Follow us
Surya Kala

|

Updated on: Jun 08, 2025 | 6:41 AM

కూరగాయల విషయానికి వస్తే బంగాళాదుంప పేరు మొదట వినిపిస్తుంది. దీనిని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. అందుకనే చాలా మంది దీనిని కూరగాయలలో రాజుగా భావిస్తారు. బంగాళాదుంప ప్రతి కూరగాయలతోనూ సరిపోతుంది. ఏదైనా కూరగాయలతో తయారు చేస్తే.. బంగాళా దుంప జత చేస్తే దాని రుచి రెట్టింపు అవుతుంది. బంగాళాదుంప కూరగాయలలో రాజు అయితే.. మరి రాణి ఎవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా తక్కువ మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. ఈ రోజు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం..

బంగాళాదుంపలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శీతాకాలం అయినా, వేసవి అయినా, బంగాళాదుంపలు ప్రతి కూరగాయ రుచిని పెంచుతాయి. మరోవైపు కూరగాయల రాణి గురించి మాట్లాడుకుంటే, అత్యంత ప్రజాదరణ పొందిన వంకాయ కూరగాయల రాణి. దీనికి ఉన్న ప్రజాదరణ సీజనల్ కూరగాయ కావడం వల్ల దీనిని కూరగాయల రాణి అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

వాస్తవంగా భారతదేశంలో వంకాయకు చాలా కాలం చరిత్ర ఉంది ఎందుకంటే వంకాయతో అనేక సాంప్రదాయ వంటకాలు తయారు చేస్తారు. అవి ప్రసిద్ధి చెందాయి. వంకాయ వేపుడు, స్టఫ్డ్ వంకాయ ఇలా రకరకాల రుచికరమైన పదార్ధాలను తయారు చేస్తారు. వంకాయ రంగు సాధారణంగా ఊదా రంగులో ఉంటుంది. అయితే ఆకుపచ్చ, తెలుపు , లేత ఊదా రంగు వంకాయలు కూడా అందుబాటులో ఉన్నాయి. వంకాయలు పొడవుగా, గుండ్రంగా, చిన్న సైజులలో కూడా వస్తాయి.

పోషకాలతో నిండిన వంకాయ చరిత్ర చాలా పాతది. ఇది దక్షిణాసియాలోని దేశమైన భారతదేశంలో ఉద్భవించిన కూరగాయ. అంటే వంకాయకు జన్మస్థానం భారతదేశం. ఇక్కడే మొదటిసారిగా కనుగొన్నారు. అందుకే వంకాయను కూరగాయలకు రాజుని కొందరు లేదు రాణి అని కొందరు పిలుస్తారు.

వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు రుచితో పాటు వంకాయలో అనేక యాంటీఆక్సిడెంట్లు కూడా కనిపిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి మంచివి. పబ్‌ఎమ్‌డి ప్రకారం వంకాయలో కనిపించే యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వంకాయ చర్మం రంగులో ఒక ప్రత్యేక రకమైన యాంటీఆక్సిడెంట్ కనిపిస్తుంది. ఇది మెదడు కణ త్వచాన్ని రక్షిస్తుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6 ఉన్నాయి. ఇవి గుండె సంబంధిత పనిని మెరుగ్గా చేయడంలో సహాయపడతాయి. వంకాయలో ఉండే పాలీఫెనాల్స్ “చెడు” ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వంకాయ మధుమేహ రోగులకు మంచిది. వంకాయలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ఫైబర్ ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి వంకాయ ఉత్తమ ఎంపిక ఎందుకంటే.. వంకాయలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. అయితే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

వంకాయను ఎవరు తినకూడదు? జైపూర్‌కు చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సురభి పరీక్ మాట్లాడుతూ ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు వంకాయ లేదా టమోటా వంటి వాటిని తినకుండా ఉండాలని అన్నారు. వీటి విత్తనాల వల్ల రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం వంకాయలో సోలాసోడిన్ రామ్నోసిల్ గ్లైకోసైడ్స్ (SRGs) వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అయితే కొంతమందికి వంకాయ తింటే అలెర్జీ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా వంకాయ తింటే అది మీకు సరిపోతుందో లేదో శరీర తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)