Ayurvedic Medicine: దీన్ని చూసి పిచ్చి మొక్క అనుకునేరు.. ఎన్నో రోగాలకు దివ్యౌషధం!
ప్రకృతిలో రకరకాల సహజ ఔషధ మొక్కలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వాటిని సరిగ్గా ఉపయోగించాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. తిప్పతీగ అటువంటి శక్తివంతమైన ఔషధ మొక్కలలో ఒకటి . ఇవి ప్రతిచోటా తీగల్లా వ్యాపించి కనిపిస్తాయి. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయుర్వేదం ప్రకారం దీన్ని వినియోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని సరిగ్గా ఉపయోగిస్తే అనేక రకాల వ్యాధులను ఇది నయం చేస్తుంది. ఈ తీగ ఆకులు, కాండం, కొమ్మలు అన్నీ మందుల తయారీలో ఉపయోగించబడతాయి..

తిప్ప తీగ ప్రకృతి ఇచ్చిన శక్తివంతమైన ఔషధ మొక్కలలో ఒకటి. గతంలో కరోనా వచ్చినప్పుడు, దాని రసం తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని చెప్పడంతో అందరూ ఇళ్లల్లో దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. ఆ తర్వాతే చాలా మందికి దీని గురించి తెలిసింది. దీంతో తమ ఇళ్లలో దీనిని పెంచడం, ఉపయోగించడం ప్రారంభించారు. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. దీనిని వినియోగించే ముందు ఇది ఏ ఆరోగ్య సమస్యలకు మంచిదో తెలుసుకోవడం ముఖ్యం. తిప్ప తీగ ఆకు రసం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. పోషకాలను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా తిప్ప తీగ మధుమేహం, చర్మ వ్యాధులు, కీళ్ల వ్యాధులు, అల్సర్లు, జ్వరం వంటి ఇతర ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తిప్ప తీగ ఆరోగ్య ప్రయోజనాలు
- ఈ తీగ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. తరచుగా వచ్చే దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది.
- తిప్ప తీగ ఆకులను తీసుకోవడం వల్ల ఆస్తమా నయం అవుతుంది. ఇది ఛాతీ బిగుతు, దగ్గు, గురక వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
- తిప్ప తీగ ఆకులను చూర్ణం చేసి బెల్లం కలిపి తీసుకుంటే, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
- ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచిది. దీని రసం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
- ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుందని, వివిధ వ్యాధులను నియంత్రిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కానీ ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం దీనిని తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించాలని గుర్తుంచుకోండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.