Mushrooms: పుట్టగొడుగులు తినడం మీకూ ఇష్టం ఉండదా? అయితే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే పుట్టగొడుగులను మన ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి . పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి..

కొంతమందికి పుట్టగొడుగులు అస్సలు నచ్చవు. వాటికి రుచి ఉండదని చెప్పే వారు కూడా లేకపోలేదు. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే పుట్టగొడుగులను మన ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి . పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి . వీటిని ప్రతిరోజూ తినలేకపోయినా కనీసం వారానికి ఒకసారి తినడానికి ప్రయత్నించాలి. పుట్టగొడుగులు ఎందుకు తినాలి? వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
- పుట్టగొడుగులలో లభించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి.
- పుట్టగొడుగులలో లభించే సహజ పోషకాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
- పుట్టగొడుగులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
- బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు చాలా మంచివి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల, వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీకు ఆకలి తగ్గుతుంది. దీంతో క్రమంగా బరువు పెరగకుండా చేస్తుంది.
- పుట్టగొడుగులలో విటమిన్ డి అధికంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.
- పుట్టగొడుగులు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
- ఈ పుట్టగొడుగులు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. చెడు పదార్థాలను వేగంగా బయటకు పంపుతాయి.
- పుట్టగొడుగులలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, జుట్టు అందంగా పెరగడానికి సహాయపడతాయి.
- పుట్టగొడుగులలో లభించే యాంటీఆక్సిడెంట్ ఎర్గోథియోనిన్ క్యాన్సర్‌ను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజుకు 18 గ్రాముల పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని 45% వరకు తగ్గించవచ్చని పరిశోధనలో తేలింది.
- పుట్టగొడుగులలో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వీటిలోని బీటా-గ్లూకాన్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించాలని గుర్తుంచుకోండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.