AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: యజమాని కుటుంబం కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు! షాకింగ్‌ వీడియో..

నమ్మకం, విశ్వాసం, నిజాయితీ, నిస్వార్ధం.. ఈ విషయాల్లో జంతువుతో పోల్చితే మనిషి ఫెయిల్‌. ప్రమాదం పొంచి ఉందని తేలితే అయినవారిని కూడా తుంగలో తొక్కేరకం మానవ స్వభావం. కానీ జంతువులు అలా కాదు. ఆశ్రయం ఇచ్చినవారికి, పట్టెడన్నంపెట్టి కడుపు నింపినవారి కోసం ప్రాణాలు పణంగా పెడతాయి. దీనిని మరోమారు రుజువు చేసింది ఓ శునకం. గాఢ నిద్రలో ఉన్న యజమాని కుటుంబాన్ని కాపాడటం కోసం విషపూరితమైన పాముతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయింది..

Viral Video: యజమాని కుటుంబం కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు! షాకింగ్‌ వీడియో..
Pet Dog Fights With Venomous Snake
Srilakshmi C
|

Updated on: Jun 06, 2025 | 6:06 PM

Share

మనుషులకి, జంతువులకి సంస్కారం అనే అడ్డుగీత ఉంటుంది. అదిలేకుంటే మనిషి సమాజంలో ఉన్న జంతుప్రవృతి ఉన్నట్లే లెక్క. అయితే జంతువులు అలా కాదు. వాటి సహజ స్వభావం వల్ల అవి ఎక్కడున్నా ఒకేలా ఉంటాయి. నమ్మకం, విశ్వాసం, నిజాయితీ, నిస్వార్ధం.. ఈ విషయాల్లో జంతువుతో పోల్చితే మనిషి ఫెయిల్‌. ప్రమాదం పొంచి ఉందని తేలితే అయినవారిని కూడా తుంగలో తొక్కేరకం మానవ స్వభావం. కానీ జంతువులు అలా కాదు. ఆశ్రయం ఇచ్చినవారికి, పట్టెడన్నంపెట్టి కడుపు నింపినవారి కోసం ప్రాణాలు పణంగా పెడతాయి. ఇది నిజమేనని చెప్పే సంఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

మీరట్‌లోని దౌరాలాలో నగర్ పంచాయతీ దౌరాలాలోని 6వ వార్డులోని మొహల్లా రాంపురిలో కల్లు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వీరి ఇంట్లో అమెరికన్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క మిని ఉంది. అయితే మే 2వ తేదీన తెల్లవారు జామున 3 గంటలకు అత్యంత విషపూరితమైన పాము ఒకటి కల్లు ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. పామును పసిగట్టిన వరండాలోని మిని కొద్దిసేపు మొరిగి ఇంటి యజమానికి సిగ్నల్‌ ఇచ్చింది. వారు వచ్చేలోపు పామును ఇంట్లోకి వెళ్లనీయకుండా మిని వీరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో ఆ పాము మినిని అనేక చోట్ల కరిచి గాయపరిచింది. కుక్క మొరిగే శబ్దం విని బయటకు వచ్చేసరికి, కుక్క అపస్మారక స్థితిలో పడి ఉంది. దాని నోట్లో పాము గట్టిగా పట్టుకుని కదలనీయకుండా పట్టుకుంది. వెంటనే కల్లు పామును బంధించి జనావాసాలకు దూరంగా విడిచిపెట్టాడు.

ఇవి కూడా చదవండి

అనంతరం మినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా దాని బాడీపై ఏకంగా 26 పాము కాటు గుర్తులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అందించినప్పటికీ పాము కాటు కారణంగా 27 గంటలు ప్రాణాలతో పోరాడి మిని మృతి చెందింది. మినిని కాటు వేసిన పాము రస్సెల్ వైపర్ కోబ్రా అని యజమాని తెలిపాడు. అది అత్యంత విషపూరితమైన పాము. ఇవి కోపంగా ఉండే స్వభావం కలిగి ఉంటాయి. ఈ పాము కరిస్తే అమోటాక్సిన్ విషాన్ని విడుదల చేస్తుంది. దాని కాటు తర్వాత రక్తం గడ్డకట్టి గంటలోపే మరణం సంభవిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.